ఇంతకుముందులా ఇప్పుడెవరూ కామెడీ పాత్రలు రాయడం లేదు: సునీల్
- సందడిగా శిరీష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
- ముఖ్య అతిథిగా వచ్చిన బాలకృష్ణ
- తన పాత్రను గురించి ప్రస్తావించిన సునీల్
- ఇదివరకటిలా భారీ కథలు రావడం లేదని వ్యాఖ్య
బాలకృష్ణ ముఖ్య అతిథిగా 'ఊర్వశివో రాక్షసివో' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదులో ఏర్పాటు చేశారు. అల్లు శిరీష్ - అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఈ సినిమాలో సునీల్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. "బాలకృష్ణగారి క్రమశిక్షణ గురించి .. ఆయన మంచి మనసును గురించి నాకు బాగా తెలుసు. ఆయన ఈ ఫంక్షన్ కి రావడం ఆనందాన్ని కలిగించే విషయం" అని అన్నాడు.
"గతంలో గీతా ఆర్ట్స్ లోని సినిమాలను లైన్లో నుంచుని టిక్కెట్టు కొని చూశాను. ఆ తరువాత గీతా ఆర్ట్స్ లో సినిమాలు చేశాను. ఈ సంస్థ ద్వారా ఎంతోమంది కళాకారులను పోషిస్తున్న అరవింద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో కామెడీ పాత్రలను గతంలో మాదిరిగా ఎవరూ రాయడం లేదు. ఇప్పుడు ఉపకథలన్నీ కథలైపోయాయి. ఈ సందులో నుంచి వెళ్లి ఆ సందులోకి తిరిగితే సినిమా అయిపోయిందని అంటున్నారు" అని చెప్పాడు.
"భారీ కథలు .. ఆ కథలో భాగంగా కామెడీ ఎపిసోడ్స్ .. ఇప్పుడు ఉండటం లేదు. అందువలన ఇదివరకటిలా నేను కామెడీ వేషాలు వేయలేకపోతున్నాను. కానీ ఈ సినిమాలో మాత్రం దర్శకుడు రాకేష్ శశి పాత సునీల్ ను చూపించే ప్రయత్నం చేశాడు. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసే సినిమా ఇది. అల్లు శిరీష్ కి ఇంతకాలానికి సరైన సినిమా పడిందని నేను బలంగా చెప్పగలను" అంటూ ముగించాడు.