ఇలాంటి సవాళ్లు మనలోని సత్తాను వెలికితీస్తాయి... సమంతకు చిరంజీవి సందేశం
- అరుదైన రుగ్మతతో బాధపడుతున్న సమంత
- సమంతకు మయోసైటిస్ నిర్ధారణ
- త్వరగా కోలుకోవాలంటూ చిరంజీవి సందేశం
- నువ్వు అద్భుతమైన అమ్మాయివి అంటూ కితాబు
టాలీవుడ్ నటి సమంత మయోసైటిస్ అనే అరుదైన రుగ్మత బారినపడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సమంత నువ్వు త్వరగా కోలుకోవాలి అంటూ సందేశం వెలువరించారు. డియర్ సామ్... అంటూ చిరు ట్వీట్ చేశారు.
"మన జీవితాల్లో ఎప్పటికప్పుడు సవాళ్లు ఎదురవుతుంటాయి. బహుశా మనలోని సత్తాని వెలికితీయడానికి ఇలాంటి సవాళ్లు ఉపకరిస్తుంటాయి. నువ్వు ఎంతో ఆత్మస్థైర్యం ఉన్న అద్భుతమైన అమ్మాయివి. ఈ సవాల్ ను కూడా నువ్వు అధిగమించగలవని నేను కచ్చితంగా చెప్పగలను. త్వరలోనే నువ్వు మామూలు మనిషివి అవుతాయి. ఈ కష్ట సమయంలో నీకు ధైర్యం, దృఢవిశ్వాసం కలగాలని కోరుకుంటున్నాను. ఆ దైవశక్తి కూడా నీ వెన్నంటే ఉంటుందని ఆశిస్తున్నాను" అంటూ చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు.