'భలే భలే మగాడివోయ్' సీక్వెల్ చేయాలనుంది: నాని
- ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్'
- ముఖ్య అతిథిగా వచ్చిన నాని
- 'భలే భలే మగాడివోయ్' సీక్వెల్ ప్రస్తావన
- నవ్వుతూ ఓకే చెప్పిన మారుతి
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' సినిమా వచ్చేనెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటుకు నాని ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆయన మాట్లాడుతూ .. 'గోల్కొండ హైస్కూల్' సినిమా చూసినప్పుడే నేను అనుకున్నాను .. ఈ కుర్రాడెవరో మంచి హీరో అవుతాడని. ఆ తరువాతనే నాకు తెలిసింది తను శోభన్ గారి అబ్బాయి అని. నాలాగే తను కూడా మోహనకృష్ణ ఇంద్రగంటి స్కూల్" అన్నాడు.
"సంతోష్ ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నాడని విన్నాను. తనని చూస్తుంటే నా పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. 'జాతిరత్నాలు' ఫస్టు సినిమానే అయినా ఫరియా చాలా బాగా చేసింది. నేను మాలలో ఉన్నాను .. పైగా చెప్పులు కూడా లేవు .. నన్ను తీసుకొచ్చి ఫరియా పక్కన నిలబెట్టారు. మామూలుగా నేను అంత పొట్టి కాదుగానీ .. ఇప్పుడు తనముందు కాస్త పొట్టిగానే కనిపిస్తానేమో. బ్రహ్మాజీగారితో కలిసి నేను చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. మరోసారి ఆయనతో కలిసి చేయాలనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.
"డైరెక్టర్ గాంధీలో ఒక ప్రత్యేకత ఉంది. కాసేపు మాట్లాడితే చాలు ఎవరికైనా బాగా నచ్చేస్తాడు. సినిమా చేసేటప్పుడు మనకే ఒక డౌటు వస్తుంది .. కథ నచ్చి ఒప్పుకున్నామా? గాంధీ నచ్చి ఒప్పుకున్నామా? అని. ఆయనతో ఇంతకుముందు 'కృష్ణార్జున యుద్ధం' చేశాను. కేవలం కృష్ణ పాత్రపైనే సినిమా వెళ్లుంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యుండేది. ఆ సినిమాలో రాక్ స్టార్ పాత్రకి నేను సెట్ కాలేదు. ఈ సారి మాత్రం మా నుంచి తప్పకుండా బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి ట్రై చేస్తాం.
లక్కీగా ఈ రోజున ఇక్కడ మారుతి గారిని కలిశాను. ప్రస్తుతం ఇద్దరికున్న కమిట్ మెంట్స్ పూర్తవుతే 'భలే భలే మగాడివోయ్' సెట్ చేసేయాలి. ఆ తరహా కామెడీని ఎంజాయ్ చేసి చాలా రోజులైపోయింది. ఇంతవరకూ షూటింగు సమయంలో నేను బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది 'భలే భలే మగాడివోయ్' ఒకటే. ఇక ఈ సినిమా నిర్మాత వెంకట్ గారు మరిన్ని సినిమాలు తీయాలి .. నాతో ఎక్కువ సినిమాలు తీయాలి" అంటూ నవ్వేశాడు.