ఉపాధ్యాయుడి అవతారం ఎత్తిన కల్వకుంట్ల హిమాన్షు
- ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో కార్యక్రమం
- ఐరాస కార్యాచరణలో భాగం పంచుకున్న హిమాన్షు
- సుస్థిర అభివృద్ధి అంశంపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బోధన
తెలంగాణ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకుంటున్నాడు. ఇటీవల హిమాన్షు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలవడం తెలిసిందే. క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ (సీఏఎస్) విభాగానికి అధ్యక్షుడు అయ్యాడు. హిమాన్షు సామాజిక సేవలోనూ ముందున్నాడు. బ్రిటన్ కు చెందిన తెస్సీ ఓజో సీబీఈ సంస్థ హిమాన్షుకు డయానా ఇంటర్నేషనల్ అవార్డును కూడా అందించింది.
ఇప్పుడు ఈ కల్వకుంట్ల వారసుడు ఉపాధ్యాయుడి అవతారం ఎత్తాడు. తాజాగా, ఖాజాగూడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సుస్థిర అభివృద్ధి, ప్రగతి లక్ష్యాలు సబ్జెక్టులో పాఠాలు చెప్పాడు. దీనిపై హిమాన్షు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించాడు.
"శనివారం కూడా పనిచేయాలంటే విసుగొస్తుందని ఎవరు చెప్పారు? ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి కార్యాచరణను పిల్లలకు వివరించే అవకాశం వచ్చింది" అని తెలిపాడు. ఈ కార్యక్రమం ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగింది.