అచ్చెన్నాయుడు, అయ్యన్నల నియోజకవర్గాలపై చంద్రబాబు సమీక్ష

  • నేడు 6 నియోజకవర్గాలపై చంద్రబాబు సమీక్ష
  • ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశం
  • వచ్చే ఎన్నికలే లక్ష్యంగా దిశానిర్దేశం
  • పార్టీని బలోపేతం చేయడంపై సూచనలు
టీడీపీ అధినేత చంద్రబాబు గత కొన్నిరోజులుగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కుప్పం, మంగళగిరి, ఇచ్ఛాపురం, కర్నూలు తదితర నియోజకవర్గాలపై సమీక్ష చేపట్టిన చంద్రబాబు, నేడు మరో 6 నియోజకవర్గాల ఇన్చార్జిలను పిలిపించి వారితో సమీక్ష నిర్వహించారు. 

టెక్కలి, నర్సీపట్నం, పాతపట్నం, పొన్నూరు, పలమనేరు, తాడిపత్రి నియోజకవర్గాల ఇన్చార్జిలతో సమీక్షించారు. చంద్రబాబుతో సమావేశమైన వారిలో అచ్చెన్నాయుడు (టెక్కలి), అయ్యన్నపాత్రుడు (నర్సీపట్నం), ధూళిపాళ్ల నరేంద్ర (పొన్నూరు) వంటి అగ్రనేతలు ఉన్నారు. 

ఈ మధ్యాహ్నం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడిన చంద్రబాబు... అనేక అంశాలపై వారితో చర్చించారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఈ సమీక్ష జరిగినట్టు తెలుస్తోంది. ఆ మేరకు వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో కలమట వెంకటరమణ (పాతపట్నం), అమర్ నాథ్ రెడ్డి (పలమనేరు), అస్మిత్ రెడ్డి (తాడిపత్రి) కూడా పాల్గొన్నారు. 

తాజా సమీక్షతో కలిపి ఇప్పటిదాకా 117 నియోజకవర్గాల సమీక్ష పూర్తయింది. మిగిలిన నియోజకవర్గాల సమీక్షను త్వరలోనే చేపట్టనున్నారు.


More Telugu News