'కొరమీను' పోస్టర్ ను విడుదల చేసిన లావణ్య త్రిపాఠి
- ఆనంద్ రవి ప్రధాన పాత్రను పోషించిన 'కొరమీను'
- జాలరిపేట నేపథ్యంలో ఉత్కంఠభరితమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం
- శ్రీపతి కర్రి దర్శకత్వం.. సామాన్య రెడ్డి నిర్మాణం
ఆనంద్ రవి ప్రధాన పాత్రను పోషించిన 'కొరమీను' చిత్రం మోషన్ పోస్టర్ ను ప్రముఖ సినీ నటి లావణ్య త్రిపాఠి విడుదల చేసింది. జాలరిపేట నేపథ్యంలో, ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. వాస్తవిక జీవితాలకు దగ్గరగా ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీపతి కర్రి తెరకెక్కించారు. ఆనంద్ రవి, హరీష్ ఉత్తమన్, శత్రు, కిషోర్ ధాత్రక్, రాజా రవీంద్ర, గిరిధర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలను పోషించారు. పెళ్లకూరు సామాన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
మోషన్ పోస్టర్ చూస్తుంటే ఆకాశం విపరీతమైన మబ్బులతో మేఘావృతమై, ఉరుములు మెరుపుల మధ్య కొన్ని వందల జాలర్ల బోట్స్ కనిపించగా... అందులోని ఒక బోట్ పై 'మీసాల రాజు గారికి మీసాలు తీసేసారంట! ఎందుకు?' అంటూ పోస్టర్ కనిపిస్తుంది. పోస్టర్ చూస్తుంటే ఎంతో క్యూరియాసిటీని కలిగిస్తుంది. అక్కడే ఒక యువకుడు సీరియస్ గా ఎంతో తీక్షణంగా చూడటం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా ఉంది.