రష్యా నౌకాదళంపై డ్రోన్ల దాడి.. ఉక్రెయిన్ పైనే అనుమానాలు!
- దాడులను తిప్పికొట్టామంటున్న రష్యా
- మరోవైపు పలు నౌకలు దగ్ధమైనట్టు వార్తలు
- దాడులను రష్యా మరింత తీవ్రతరం చేసే అవకాశం
రష్యా ఆక్రమించుకున్న క్రిమియాలో విధుల్లో ఉన్న నౌకాదళాలపై డ్రోన్లతో దాడి జరిగింది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తీవ్రమైన వేళ ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడులను తిప్పికొట్టామని రష్యా అధికారులు తెలిపారు. రష్యా నేవీ డ్రోన్లను కాల్చివేసిందని చెప్పారు. ఈ దాడుల కారణంగా తమ మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని అన్నారు.
మరోవైపు, ఈ దాడుల్లో రష్యాకు చెందిన పలు నౌకలు దగ్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. దట్టంగా పొగలు కమ్మేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉక్రెయిన్ సైన్యమే ఈ దాడికి పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు క్రిమియాను, రష్యాను కలిపే వంతెనను ఉక్రెయిన్ ఇటీవలే పేల్చి వేసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రష్యా దాడులను ముమ్మరం చేసింది. ఇప్పుడు తాజా డ్రోన్ దాడుల నేపథ్యంలో రష్యా దాడులను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది.