మొయినాబాద్ ఫాంహౌస్ నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- సైబరాబాద్ కమిషనర్ ముందు లొంగిపోవాలంటూ నిందితులకు హైకోర్టు ఆదేశం
- మీడియా కంట కనపడకుండా నిందితులను తరలించిన పోలీసులు
- సాయంత్రంలోగా ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్న వైనం
హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ లోని ఫాం హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు చేశారనే కేసులో ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వీరిని రిమాండ్ కు పంపేందుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిందితులు సైబరాబాద్ కమిషనర్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో, నిందితులు నందకుమార్, సింహయాజులు, రామచంద్రభారతిలు పోలీసులకు లొంగిపోయారు. వారిని అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు మీడియా కంట పడకుండా షేక్ పేట్ నుంచి వారిని తరలించారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి సాయంత్రంలోగా ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అయితే, మునుగోడు ఎన్నికల వరకు విచారణ జరపవద్దని హైకోర్టు ఆదేశించడంతో... కోర్టు నుంచి వారిని జైలుకు తరలించనున్నారు.