అప్పుడు కోట శ్రీనివాసరావుకి వాణిశ్రీ చీవాట్లు పెట్టారు: బాబూ మోహన్
- సీనియర్ కమెడియన్ గా బాబూ మోహన్ కి గుర్తింపు
- కోట కాంబినేషన్లో చేసిన సినిమాలన్నీ హిట్లే
- తాము కలిసి నటించిన ఫస్టు మూవీ 'బొబ్బిలిరాజా' అంటూ వెల్లడి
- 'మామగారు' నుంచి తమ మధ్య స్నేహం ఏర్పడిందంటూ వివరణ
తెలుగు తెరపై నిన్నటితరం హాస్యనటుడిగా బాబూ మోహన్ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయారు. ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ అప్పట్లో ఎంతోమందిని ఆకట్టుకున్నాయి. ఆయనను స్టార్ కమెడియన్ గా చేశాయి. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన గురించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
'ఈ ప్రశ్నకు బదులేది' నా మొదటి సినిమా .. కానీ ఆ సినిమా రిలీజ్ కాలేదు. ఆ సినిమాలో హీరోగా చేసిన రాజశేఖర్ ద్వారా నా గురించి విన్న కోడి రామకృష్ణ గారు, నన్ను 'ఆహుతి' సినిమా కోసం తీసుకున్నారు. ఆ సినిమాలో బాగా చేయడంతో 'అంకుశం' సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా రిలీజ్ తరువాత వరుసగా పది సినిమాలపై సంతకం చేశాను. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు" అని చెప్పారు.
కోట శ్రీనివాసరావు గారు .. నేను ''బొబ్బిలిరాజా' సినిమా కోసం కలిసి పనిచేశాము. అప్పటికే ఆయన చాలా సీనియర్. అందువలన నన్ను కామెంట్ చేస్తుండేవారు. ఒకసారి అది చూసిన వాణిశ్రీ గారు, కోటపై సీరియస్ అయ్యారు. 'నువ్వు సీనియర్ అనే కదా బాబూ మోహన్ ను కామెంట్ చేస్తున్నావ్ .. మరి నీకంటే నేను సీనియర్ ను. నిన్ను కూడా నేను అలా అనవచ్చును గదా?" అన్నారు. అప్పటి నుంచి ఆయన తగ్గారు. ఆ తరువాత 'మామగారు' నుంచి మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది" అంటూ చెప్పుకొచ్చారు.