ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా విజయబాబు

  • ఇటీవల రాజీనామా చేసి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
  • విజయబాబుకు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం
  • రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న విజయబాబు
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం నూతన అధ్యక్షుడిగా విజయబాబు నియమితులయ్యారు. ఈ పదవిలో విజయబాబు రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. సీనియర్ జర్నలిస్టు అయిన విజయబాబు గతంలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 

ఇటీవల కొన్ని పరిణామాల నేపథ్యంలో, అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేయడం తెలిసిందే. యార్లగడ్డ రాజీనామాను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా విజయబాబుకు రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్ష పదవీబాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇటీవల ఏపీ ప్రభుత్వం విజయవాడలోని వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగించి, వైఎస్సార్ పేరుపెట్టడం తెలిసిందే. ఈ పరిణామంతో మనస్తాపం చెందిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.


More Telugu News