బాలిలో భేటీ కాబోతున్న మోదీ, రిషి సునాక్

  • వచ్చే నెల ఇండొనేషియాలోని బాలిలో జీ20 లీడర్ షిప్ సమ్మిట్
  • ప్రత్యేకంగా సమావేశం కానున్న మోదీ, రిషి
  • ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన బ్రిటన్ ప్రధాని కార్యాలయం
బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్, భారత ప్రధాని నరేంద్ర మోదీలు భేటీ కాబోతున్నారు. ఇండొనేషియాలోని బాలిలో వచ్చే నెల జీ20 లీడర్ షిప్ సమ్మిట్ జరగబోతోంది. ఈ సమావేశాల్లో ఇరువురూ ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు అంగీకారం తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించి బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 

ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్ లు ప్రపంచ ఆర్థికశక్తులుగా మరింత వికసించేందుకు ఇరు దేశాల అధినేతలు కలిసికట్టుగా పని చేయడానికి సమ్మతం తెలిపారని ప్రకటనలో తెలిపింది. ఇండొనేషియాలో జరిగే సమ్మిట్ లో ఇరువురు ప్రధానులు చర్చలు జరుపుతారని పేర్కొంది. మరోవైపు పీఎంగా బాధ్యతలను చేపట్టిన రిషి సునాక్ కు నిన్న నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంశాన్ని రిషి దృష్టికి తీసుకెళ్లారు.


More Telugu News