టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి
- ఆస్ట్రేలియాలో వరుణుడి జోరు
- మెల్బోర్న్ లో వర్షం
- ఇంకా టాస్ కూడా వేయని వైనం
- కొద్దిసేపటి కిందట నిలిచిన వాన
- మైదానాన్ని సిద్ధం చేస్తున్న సిబ్బంది
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ కు వరుణుడు తరచుగా అవాంతరాలు సృష్టిస్తున్నాడు. ఇవాళ ఆతిథ్య ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన సూపర్-12 మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగింది. మ్యాచ్ కు వేదికైన మెల్బోర్న్ లో వర్షం కురవడంతో టాస్ వేయడానికి కూడా సాధ్యం కాలేదు. కొద్దిసేపటి క్రితం వర్షం నిలిచిపోవడంతో మైదానాన్ని మ్యాచ్ కు సిద్ధం చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇదే మైదానంలో ఈ ఉదయం (భారత కాలమానం ప్రకారం) ఆఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్ మ్యాచ్ జరగాల్సి ఉండగా, వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దయింది. దాంతో, రెండు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. ఇప్పుడు, ఆసీస్, ఇంగ్లండ్ మ్యాచ్ పైనా వరుణుడి ప్రభావం పడింది. ఒకవేళ మ్యాచ్ ప్రారంభమైనా, ఏ దశలో అయినా వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది.
సూపర్-12 దశలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు గ్రూప్-1లో ఉన్నాయి. ఆసీస్ ఇప్పటిదాకా రెండు మ్యాచ్ లు ఆడి ఒక విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడగున ఉండగా, ఇంగ్లండ్ రెండు మ్యాచ్ లు ఆడి ఒక విజయంతో నాలుగో స్థానంలో ఉంది.