దాస్ చెంప చెళ్లుమనిపించిన పోలీసులు ఆయన కాళ్లపై పడాల్సిందే: సువేందు అధికారి
- అవినీతి ఆరోపణలపై సత్యబ్రత దాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
- కస్టడీలో ఉన్న ఆయనను పోలీసులు చెంపదెబ్బ కొట్టారన్న సువేందు అధికారి
- ఆ పోలీసులు దాస్ కాళ్లపై పడేలా చేస్తానన్న బీజేపీ నేత
- లేకుంటే పేరు మార్చుకుంటానని సవాలు
- సువేందు ఏం పేరు పెట్టుకుంటారన్నది ఆసక్తిగా ఉందన్న టీఎంసీ మంత్రి
పోలీసు కస్టడీలో ఉన్న తమ నాయకుడు సత్యబ్రత దాస్‌ను ఇద్దరు పోలీసు అధికారులు చెంపదెబ్బలు కొట్టారని, ఆ పోలీసులు దాస్ కాళ్లపై పడాల్సిందేనని, అలా చేయలేకపోతే కనుక పేరు మార్చుకుంటానని శాసనసభలో బీజేపీ సభాపక్ష నేత సువేందు అధికారి అన్నారు. సువేందు వ్యాఖ్యలకు టీఎంసీ కూడా దీటుగానే స్పందించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. మునిసిపాలిటీ టెండర్ కమిటీ చైర్మన్‌గా ఉన్న సమయంలో దాస్ అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఈ నెల 19న పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
పోలీసు కస్టడీలో ఉన్న ఆయనపై సుతహత పోలీస్ స్టేషన్ అధికారులు చెంప చెళ్లుమనిపించారని సువేందు అధికారి ఆరోపించారు. దాస్‌పై చేయి చేసుకున్న పోలీసులు ఆయన కాళ్లపై పడాల్సిందేనని, అలా చేయలేకపోతే తాను సువేందు అధికారినే కాదని, తన పేరు మార్చుకుంటానని సవాలు చేశారు.
సువేందు వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి ఫిర్హద్ హకీం స్పందించారు. సువేందు త్వరలోనే పేరు మార్చుకోబోతున్నారని, ఆ పేరు ఏంటన్నది ఆసక్తిని రేకెత్తిస్తోందని సెటైర్ వేశారు. దాస్ బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయడంతోపాటు అవినీతికి పాల్పడినట్టు కచ్చితమైన ఆధారాలు ఉండడంతోనే పోలీసులు అరెస్ట్ చేశారని మంత్రి అన్నారు.