పెర్త్ లో పాకిస్థాన్ వర్సెస్ జింబాబ్వే... కసి మీదున్న బాబర్ సేన

  • తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిన పాక్
  • నేటి మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన వైనం
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పెర్త్ లో పాకిస్థాన్, జింబాబ్వే తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జింబాబ్వే బ్యాటింగ్ ఎంచుకుంది. 

సూపర్-12 దశ తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిపోయిన పాక్ కసితో రగిలిపోతోంది. జింబాబ్వేపై విజయమే లక్ష్యంగా బరిలో దిగింది. అయితే, ప్రధాన పేసర్ షహీన్ అఫ్రిదీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. తొలి స్పెల్ లో 2 ఓవర్లు విసిరి 16 పరుగులు ఇచ్చిన అఫ్రిదీ... ఆ తర్వాత మరో ఓవర్ వేసి 8 పరుగులు సమర్పించుకున్నాడు. 3 ఓవర్లు వేసిన అఫ్రిదీ 24 పరుగులు సమర్పించుకున్నాడు. 

ఇక 10 ఓవర్లు ముగిసేసరికి జింబాబ్వే 3 వికెట్లకు 67 పరుగులు చేసింది. వెస్లీ మడెవెర్ 17, కెప్టెన్ క్రెగ్ ఇర్విన్ 19, మిల్టన్ షుంబా 8 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో షాన్ విలియమ్స్ (15 బ్యాటింగ్), సికందర్ రజా (1 బ్యాటింగ్) ఉన్నారు.


More Telugu News