నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ..
- కేవలం 9 పరుగులకే అవుటైన రాహుల్
- తొలి ఓవర్లోనే భారత్ ను దెబ్బతీసిన మికెరెన్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్
టీ20 ప్రపంచకప్ లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ లో నెదర్లాండ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 9 పరుగులకే అవుటయ్యాడు. తొలి ఓవర్ లోనే పాల్ వాన్ మికెరెన్ రాహుల్ వికెట్ తీసి భారత్ ను దెబ్బ కొట్టాడు.
మరో ఓపెనర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో కలసి ఇన్నింగ్స్ ను గాడిన పెట్టడంపై దృష్టి సారించాడు. రోహిత్ శర్మ 29 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 12 పరుగులతో క్రీజులో ఆడుతున్నారు. భారత్ ఒక వికెట్ నష్టానికి 8.4 ఓవర్లలో 51 పరుగులు సాధించింది. 5.88 రన్ రేట్ నడుస్తోంది. అంతకుముందు భారత్ టాస్ గెలవగా, రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.