మునుగోడులో గెలిచేది ఈ పార్టీనే: నాగన్న ప్రీ పోల్ సర్వే
- ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు తొలి దశ సర్వే నిర్వహించిన నాగన్న
- టీఆర్ఎస్ కు 43.66 శాతం.. బీజేపీకి 35.39 శాతం ఓట్లు వస్తాయని వెల్లడి
- పెన్షన్లు, సంక్షేమ కార్యక్రమాల వల్ల టీఆర్ఎస్ వైపు ప్రజల మొగ్గు
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఏ పార్టీ విజయం సాధిస్తుందో అనే టెన్షన్ అందరిలో ఉంది. ఈ నేపథ్యంలో థర్డ్ విజన్ రీసర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో నాగన్న ప్రీ పోల్ సర్వే నిర్వహించారు. ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించిన తొలి దశ సర్వే వివరాలను విడుదల చేశారు. టీఆర్ఎస్ కు 43.66 శాతం, బీజేపీకి 35.39 శాతం, కాంగ్రెస్ కు 15.96 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేలినట్టు చెప్పారు. పెన్షన్లు, సంక్షేమ కార్యక్రమాలు వంటివి క్రేత్ర స్థాయి వరకు చేరుతుండటంతో ప్రజలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినట్టు నాగన్న అంచనా వేశారు.