రిషి సునాక్‌ను అభినందించని పుతిన్.. ఎందుకో చెప్పిన రష్యా
- బ్రిటన్ తమ విరోధి దేశాల జాబితాలో ఉందన్న రష్యా
- బ్రిటన్‌తో సత్సంబంధాలు మెరుగయ్యే అవకాశం కనిపించడం లేదని వ్యాఖ్య
- అందుకే శుభాకాంక్షలు చెప్పలేదని వివరణ
బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్‌ను ప్రపంచ దేశాలన్నీ అభినందించినా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం శుభాకాంక్షలు చెప్పకుండా దూరంగా ఉన్నారు. రిషిని పుతిన్ ఎందుకు అభినందించలేదన్న దానిపై రష్యా అధ్యక్ష భవనం వివరణ ఇచ్చింది. బ్రిటన్ ఇప్పుడు తమ విరోధి దేశాల జాబితాలో ఉందని, అందుకే రిషికి పుతిన్ శుభాకాంక్షలు చెప్పలేదని పేర్కొంది. ఈ మేరకు పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. అంతకుముందు పెస్కోవ్ మాట్లాడుతూ.. సునాక్ నేతృత్వంలోని బ్రిటన్‌తో రష్యా సంబంధాలు మెరుగయ్యే అవకాశాలేమీ కనిపించడం లేదని అన్నారు.
మరోవైపు, రష్యా శత్రుదేశం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో మాట్లాడిన రిషి తమ మద్దతు ప్రకటించారు. కాగా, సునాక్ బ్రిటన్ ప్రధాని కావడంపై భారత్, చైనా, అమెరికా సహా పలు దేశాలు స్పందించాయి. సునాక్‌ను అభినందించాయి. ప్రపంచ సమస్యలపై బ్రిటన్ కొత్త ప్రధానితో కలిసి పనిచేస్తామని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సునాక్‌కు అభినందనలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. అమెరికా, బ్రిటన్, భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాల్లోనే ఇలాంటి ఎంపికలకు అవకాశం ఉందని అన్నారు.