యానాంలో 'గుప్పెడు బియ్యం'పై ప్రశంసలు కురిపించిన విజయసాయిరెడ్డి
- యానాంలోని రీజెన్సీ కళాశాలలో గుప్పెడు బియ్యం పథకం
- ప్రతి బుధవారం కళాశాల విద్యార్థులు బియ్యాన్ని దానం చేస్తున్న వైనం
- ఆ బియ్యాన్ని అనాథలకు అందజేస్తున్న కళాశాల అధ్యాపకులు
- ఈ పథకాన్ని మెచ్చుకుంటూ పోస్ట్ పెట్టిన సాయిరెడ్డి
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి బుధవారం సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర పోస్టును పెట్టారు. కాకినాడ తీరాన్ని ఆనుకున్న ఉన్న పుదుచ్చేరికి చెందిన యానాంలో ఓ కళాశాలలో కొనసాగుతున్న దానం గురించి సాయిరెడ్డి తన పోస్టులో ప్రస్తావించారు.
యానాంలో ఏపీకి చెందిన పారిశ్రామికవేత్త రీజెన్సీ పేరిట సిరామిక్స్ కంపెనీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీ ఏళ్ల క్రితమే మూతపడినా... యానాంలో ఆ కంపెనీ పేరిట ప్రారంభించిన సేవా కార్యక్రమాలు, విద్యాలయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలా యానాంలో ఏర్పాటైన రీజెన్సీ కళాశాలకు చెందిన అధ్యాపకుల ప్రేరణతో విద్యార్థులు ఐదేళ్ల క్రితం 'గుప్పెడు బియ్యం' పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధవారం కళాశాలకు చెందిన 530 మంది విద్యార్థులు గుప్పెడు బియ్యం చొప్పున కళాశాలకు తీసుకొస్తున్నారు. ఈ బియ్యాన్ని కళాశాల అధ్యాపకులు అనాథలకు అందిస్తున్నారు. ఈ పథకాన్ని మెచ్చుకుంటూ విద్యార్థులు బియ్యాన్ని దానం చేస్తున్న ఫొటోను సాయిరెడ్డి తన పోస్టుకు జత చేశారు.