200 కోట్ల క్లబ్ లో 'కాంతార' .. బాలీవుడ్ లోను అదే దూకుడు!
- ఒక రోజు తేడాతో తెలుగు .. హిందీ భాషల్లో విడుదలైన 'కాంతార'
- హిందీలో 24 కోట్ల గ్రాస్ వసూళ్లు
- తెలుగులో 27 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టిన సినిమా
- ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకి పైగా వసూళ్లు
- చిన్న సినిమా సాధించిన అతిపెద్ద విజయంగా టాక్
ఈ మధ్య కాలంలో ఎక్కువమంది మాట్లాడుకున్న సినిమాలలో 'కాంతార' ఒకటి. కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలి ఆటతోనే అక్కడ తన దూకుడు చూపడం మొదలుపెట్టింది. కన్నడలో అత్యంత వేగంగా అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. తెలుగులో ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేస్తే, అంతకంటే ఒక రోజు ముందుగా హిందీలో విడుదల చేశారు.
తెలుగులో ఈ సినిమా 10 రోజులలో 27 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేస్తే, హిందీలో 24 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టింది. ఈ సినిమాలోని ఆర్టిస్టులు ఇటు తెలుగులోగానీ .. అటు హిందీలో గాని పెద్దగా ఎవరికీ తెలియదు. అయినా కంటెంట్ తో కట్టిపడేసింది. కథాకథనాల్లోని కొత్తదనం ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. అలా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.
టాలీవుడ్ విషయానికే వస్తే, దీపావళికి నాలుగు సినిమాలు థియేటర్లలో దిగిపోయాయి. అప్పటికే 'కాంతార' వచ్చి వారం రోజులు కావడంతో, ఇక ఆ సినిమా వసూళ్లు తగ్గుతాయని చాలామంది భావించారు. కానీ ఆ నాలుగు సినిమాల పోటీని కూడా 'కాంతార' తట్టుకుని నిలబడింది. కొత్తగా వచ్చిన సినిమాలు కొన్ని డీలాపడినా, 'కాంతార' మాత్రం తన జోరును కొనసాగిస్తూ ఉండటం విశేషం.