పొట్టి ప్రధానిగా రిషి సునాక్.. చర్చిల్ కంటే కాస్త పొడవు అంతే!

  • రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత పొట్టివాడైన ప్రధానిగా రిషి సునాక్
  • యూరప్‌లో దేశాధినేతలుగా నలుగురు మాత్రమే పొట్టివారు
  • రిషి ఎత్తు 5.6 అడుగులు
బ్రిటన్ ప్రధానిగా భారతీయ మూలాలున్న రిషి సునాక్ ఎన్నికైన తర్వాత ఆయనకు సంబంధించిన వార్తలు బ్రిటన్ సహా గ్లోబల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ప్రధానిగా ఎన్నికైన ఆయన ముందున్న సవాళ్లతోపాటు ఆయన వ్యక్తిగత జీవితం, ఎవరికీ తెలియని ఇతర విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, బ్రిటన్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత పొట్టివాడైన బ్రిటన్ ప్రధాని రిషియేనట.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రధానిగా ఉన్న విన్‌స్టన్ చర్చిల్ ఎత్తు 5.5 అడుగులు. ఆ తర్వాత బ్రిటన్ ప్రధానులు అయిన వారంతా 5.7 అడుగులు, ఆ పైబడిన వారే. ఇప్పుడు రిషి సునాక్ ఎత్తు 5.6 అడుగులు. దీంతో అది కాస్తా వార్త అయిపోయింది. మార్గరెట్ థాచర్, లిజ్ ట్రస్ ఇద్దరి ఎత్తు 5.5 అడుగులే అయినా మహిళలు కాబట్టి వారిని ఎవరూ పట్టించుకోలేదు. 

యూరప్‌లో నలుగురు మాత్రమే..
ఇప్పుడు సునాక్ ప్రధాని కావడంతో ఎత్తు అంశం తెరపైకి వచ్చింది. యూరప్ దేశాల్లో ప్రస్తుతం 5.7 అడుగులు, అంతకంటే పొడవున్న దేశాధినేతలు నలుగురు మాత్రమే ఉన్నారు. వారిలో రిషి సునాక్ (5.6 అడుగులు), ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ (5.7 అడుగులు), జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్ (5.5 అడుగులు), ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ (5.5 అడుగులు) ఉన్నారు.


More Telugu News