ప్రెస్ నోట్: విదేశాలలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్స్ పొందండి

  
ప్రెస్ నోట్:  ఎక్సల్ల ఎడ్యుకేషన్ గ్రూప్ USA  లో రిజిస్టర్ చేయబడి ఇండియా నుండి సేవలు అందిస్తుంది మరియు ఇప్ప్పుడు UAE కి కూడా విస్తరింపబడింది. USA, UK, కెనడా, ఆస్ట్రేలియా మరియు జర్మనీ వంటి వివిధ దేశాలలో విద్యార్థులు చదువుకోవడానికి సహాయం చేయడంలో మేము మార్గదర్శకులుగా వ్యవహరిస్తున్నాము.
 
ఎక్సల్ల గ్రూప్ చైర్మన్ శ్రీ అరసవిల్లి అరవింద్ గారు USA లో MBA పూర్తి చేసారు. ఆయన నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు, ఇటీవల దేశం లో అభివృద్ధి చెందుతున్న విదేశీ విద్యా బృందంగా అవార్డు పొందారు. అంతేకాకుండా సమాజానికి ఎంతో కొంత సేవ అందించాలనే ఉద్దేశంతో అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఇటీవల ట్రస్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సమీపంలో ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకోవడం జరిగింది.
 
అరవింద్ గారు పరం టెక్నాలజీస్ INC పేరుతో ఒక సాఫ్ట్‌వేర్ సంస్థ ను కూడా స్థాపించారు. ఇది చిన్న తరహా కంపెనీలకు క్లౌడ్ సంబంధిత పరిష్కారాలను అందిస్తుంది.
 
కోవిడ్ తర్వాత USAలో చదువుకోవాలనుకునే విద్యార్థుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. అడ్మిషన్స్ ఎక్కువ కావడంతో అప్లికేషన్స్ ను ప్రాసెస్ చేయడానికి విశ్వవిద్యాలయాలు కూడా ముందుకు వస్తున్నాయి కాబట్టి విద్యార్థులు ఒక సంవత్సరం ముందుగానే అడ్మిషన్స్ ప్లాన్ చేసుకోవాలని అరవింద్ గారు సూచించారు.
 
ఇప్పుడు విద్యార్థులు ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌ని షెడ్యూల్ చేయడానికి ఎక్కడ నుండి అయిన మా వెబ్‌సైట్ www.exxeella.com కి లాగిన్ చేయవచ్చు లేదా వాట్సాప్  నెంబర్ 91 9888196666 ద్వారా విద్యార్థులు ఏ దేశాన్ని ప్లాన్ చేసుకోవాలి మరియు ఎక్కడ స్థిరపడాలి అనే సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
 
ప్రొఫైల్ అసెస్‌మెంట్ యొక్క పూర్తి వివరాల కోసం info@exellaedu.comకు ఇమెయిల్ చేయవచ్చు.
 
ఎక్సల్ల ద్వారా పొందే సేవలు:
1) ఉన్నతమైన కెరీర్ కౌన్సిలింగ్:
ఏ విద్యార్థి అయినా అంతిమంగా తమ కెరీర్ లక్ష్యాలను సాధించాలని కోరుకుంటారు. కెరీర్'ను జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోకపోతే, విద్యకు విలువ లేకుండా పోతుంది. Exxeellaలో కేవలం విద్యార్థులకు వారి విద్యను ప్లాన్ చేయడానికి మార్గనిర్దేశం చేయడమే కాకుండా, కెరీర్ ప్లానింగ్ వైపు వారి ఆలోచనలను మళ్లించేలా ప్రోత్సహిస్తాము. ఇలా చేయడం వల్ల విద్యార్థులు వారి అంతిమ లక్ష్యాన్నిసాధించగలుగుతారు.
 
నైపుణ్యం మరియు అనుభవంతో కలిగిన కౌన్సెలింగ్ అందించడం ద్వారా, మేము విద్యార్థులకు వివిధ ఆప్షన్స్ ను  పరిశీలించడానికి మరియు వారిని సరైన దిశలో నడిపించడానికి సహాయం చేస్తాము. ఇది వారి విద్యకు విలువను పెంచుతుంది, తద్వారా స్థిరమైన మరియు విజయవంతమైన కెరీర్ కోసం వారి విధానాన్ని బలోపేతం చేస్తుంది.
 
2) సరైన దేశాన్ని ఎంచుకోవడానికి మార్గదర్శకత్వం:
Exxeella మీ విద్యా, సామాజిక మరియు వృత్తిపరమైన ప్రొఫైల్‌ను వృద్ధి చేస్తుంది. మీ విద్య గురించి, అలాగే  ఏదైనా పాఠ్యేతర కార్యకలాపాలు అంటే అథ్లెటిక్స్, ఏదైనా ఇతర ప్రతిభ లేదా సమాజ సేవా కార్యక్రమాలు గురించి కూలంకుశంగ  చర్చించి తద్వారా  మీ ప్రొఫైల్‌కు సరిపడే  దేశం మరియు తగిన విద్యా సంస్థకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి సహకారం అందిస్తుంది.
 
3) విశ్వవిద్యాలయం & కోర్సు ఎంపిక:
ఇది ప్రతి విద్యార్థికి తన భవిష్యత్తును నిర్ణయించే ముఖ్యమైన అంశం. మా వద్దకు వచ్చే విద్యార్థులు ఎంచుకోవడానికి అనేక రకాల విద్యాసంస్థలు మరియు కోర్సులను కలిగి ఉన్నందున, మేము అన్ని దేశాలలో మంచి నాణ్యత మరియు  గుర్తింపు పొందిన విద్యాసంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తాము. మేము ప్రాతినిధ్యం వహించే విద్యాసంస్థల విషయంలో మేము జాగ్రత్తలు వహిస్తూ అవి పూర్తిగా నిజమైన మరియు విశ్వసనీయమైన  ప్రొవైడర్లని నిర్ధారిస్తాము. విద్యార్థుల  వీసాల విషయానికి వస్తే మాకు స్టెర్లింగ్ ట్రాక్ రికార్డ్ ఉంది.
 
4) పూర్తి అడ్మిషన్ గైడెన్స్ (Overseas Education Admission Guidance):
ఆన్‌లైన్/ పేపర్ ఆధారిత అప్లికేషన్ ఫార్మ్స్ ను పూరించడం, రెకమండేషన్ లెటర్స్ , స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ వంటి ఇతర పత్రాలు సమకూర్చుకోవడంలో మార్గదర్శకత్వం చేయడంలో మేము మీకు సహాయం చేస్తాము. ఈ పని విద్యార్థులకు అత్యంత కష్టతరమైనది అయినా చాలా ముఖ్యమైనది అయినప్పటికీ ఎక్కువగా  విస్మరించబడుతుంది. ఈ మొత్తం  ప్రక్రియలో Exxeella మీకు పూర్తిగా మార్గనిర్దేశం చేస్తుంది.
 
5) IELTS / PTE / GRE / TOEFL కోచింగ్:
అపార అనుభవం కలిగిన మా అధ్యాపక బృందం,  అధునాతన  పరికరాలతో కూడిన కోచింగ్ రూమ్ వంటి ప్రత్యేక సౌకర్యాలు ఎక్సల్ల లో చూడవచ్చు.  మరియు మా అధ్యాపక బృందం ప్రతి విద్యార్థిని అంకితభావంతో, ఏకాగ్రతతో మరియు ఎడతెగని పట్టుదలతో చూసుకుంటారు.
 
6) నిపుణుల వీసా గైడెన్స్:
ఆఫర్ లెటర్ పొందిన తర్వాత కాన్సులేట్ నుండి వీసా పొందడం అత్యంత ప్రధానమైన పని. Exxeella అద్భుతమైన వీసా డాక్యుమెంటేషన్‌ను తమ విద్యార్థులకు అందిస్తుంది. మేము ఎప్పటికప్పుడు వీసా డాక్యుమెంటేషన్ మరియు నియమాల గురించి కాన్సులేట్‌తో క్రమం తప్పకుండా సంప్రదిస్తాము. ఈ రంగంలో జరుగుతున్నమార్పులకు మరియు అభివృద్ధితో మేము ఎల్లప్పుడూ అప్‌డేట్ అవుతాము.
 
మా వీసా డివిజన్ యొక్క ప్రత్యేక లక్షణాలు క్రింద పొందుపరచడం జరిగింది.
- అన్ని దేశాలకు వీసా డాక్యుమెంటేషన్‌లో నైపుణ్యత
- US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ మరియు ఐర్లాండ్ (Student Visa for US, UK, Canada, Australia, New Zealand) వంటి దేశాలకు వెళ్లే స్టూడెంట్ వీసా పొందటంలో చాలా మంది విద్యార్థులకు సహాయం చేసారు.
- వీసా దరఖాస్తులు మరియు సేకరణలో విద్యార్థులకు సహాయం
- మాక్ ప్రశ్నలు మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ బ్రీఫింగ్.
- వీసా తిరస్కరించబడిన వారికి తిరిగి విజయవంతంగా వీసా పొందటంలో సహాయం
 
7) ప్రయాణం/వసతి & విదేశీ మారకంలో సహాయం:
Exxeella విదేశాలకు వెళ్లే విద్యార్డులకు తీసుకోవాలిసిన జాగ్రత్తల గురించి వివరిస్తుంది. ప్రయాణ ఏర్పాట్లు, విదేశీ కరెన్సీ మార్పిడి , ఇన్సూరెన్స్ మరియు ఇతర సౌకర్యాలు అన్నీ మేమే చూసుకుంటాం. మీరు వెళ్తున్న విద్యాసంస్థలలో ఇప్పటికే ఉన్న మా విద్యార్థులకు మేము మిమ్మల్ని కనెక్ట్ చేస్తాము. తద్వారా మీరు పాఠ్యాంశాలు మరియు ఇతర కార్యకలాపాలకు సంబంధించి ఏవైనా సందేహాలను సులభంగా పరిష్కరించవచ్చు.
 
Content Produced by: Indian Clicks, LLC


More Telugu News