టీ20 వరల్డ్ కప్: ఆసీస్ కు 158 రన్స్ టార్గెట్ నిర్దేశించిన లంక

  • ఆసీస్ గడ్డపై టీ20 వరల్డ్ కప్
  • పెర్త్ లో నేడు ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 157 రన్స్ చేసిన శ్రీలంక
  • రాణించిన నిస్సాంక, అసలంక
టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశలో భాగంగా నేడు ఆతిథ్య ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. పెర్త్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 157 పరుగులు చేసింది. 

ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ కుశాల్ మెండిస్ (5) వికెట్ ను కోల్పోయిన లంక... పథుమ్ నిస్సాంక, ధనంజయ డిసిల్వ, చరిత అసలంకల సమయోచిత బ్యాటింగ్ తో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. 

ఓపెనర్ నిస్సాంక 40 పరుగులు చేయగా, ధనంజయ డిసిల్వ 26 పరుగులు సాధించాడు. చరిత్ అసలంక దూకుడుగా ఆడి 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 38 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భానుక రాజపక్స (7), కెప్టెన్ దసున్ షనక (3) విఫలమయ్యారు. 

ఆసీస్ బౌలర్లలో హేజెల్ వుడ్, కమిన్స్, స్టార్క్, ఆస్టన్ అగర్, మ్యాక్స్ వెల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ ఇన్నింగ్స్ లో ఆసీస్ 23 ఎక్స్ ట్రాలు సమర్పించుకుంది.


More Telugu News