తెలంగాణలో ఈ ఏడాది 15 వేలకు పైగా మిగిలిపోయిన ఇంజినీరింగ్ సీట్లు

  • ముగిసిన ఇంజినీరింగ్ సీట్ల తుది విడత కౌన్సిలింగ్
  • మిగిలిపోయిన 15,447 ఇంజినీరింగ్ సీట్లు
  • ఈ నెల 28 నాటికి కాలేజీల్లో చేరాలన్న సాంకేతిక విద్యాశాఖ కమిషనర్
తెలంగాణలో ఈ ఏడాది ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించి సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. తుది విడత కౌన్సిలింగ్ ముగిసింది. ఈ విషయాన్ని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 28 నాటికి కాలేజీల్లో చేరాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,447 ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయని వెల్లడించారు. 

మరోవైపు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. ఏఎఫ్ఆర్సీ సిఫారసుల మేరకు తెలంగాణలోని 159 కాలేజీల్లో ఫీజులను నిర్ణయించింది.


More Telugu News