రాజగోపాల్ రెడ్డి సానుభూతి డ్రామాలను మునుగోడు ప్రజలు నమ్మవద్దు: మంత్రి తలసాని
- నవంబరు 3న మునుగోడు బైపోల్స్
- ప్రధాన పార్టీల మధ్య విమర్శల పర్వం
- తలసాని మీడియా సమావేశం
- బీజేపీ నేతలు కావాలనే దాడి చేయించుకుంటారని వ్యాఖ్యలు
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ విమర్శలు జోరందుకున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జ్వరం కారణంగా ప్రచారం రద్దు చేసుకున్నారంటూ వచ్చిన కథనాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి సానుభూతి డ్రామాలను నమ్మవద్దని మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ నేతలు కావాలనే దాడి చేయించుకున్నారని, ఇప్పుడు మునుగోడులోనూ అలాగే జరిగే అవకాశాలున్నాయని తలసాని పేర్కొన్నారు.
కేసీఆర్ ను తిడుతున్నారు కానీ, మునుగోడుకు బీజేపీ ఏంచేసిందో ఆ పార్టీ నేతలు చెప్పడంలేదని విమర్శించారు. దుబ్బాక, హుజూరాబాద్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి కోటి రూపాయలైనా తీసుకువచ్చారా? అని తలసాని బీజేపీ నేతలను నిలదీశారు. మిషన్ భగీరథతో కేసీఆర్ మునుగోడులో ఫ్లోరోసిస్ లేకుండా చేశారని వెల్లడించారు.