బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... ఏపీపై ప్రభావం చూపించే అవకాశం

  • బంగ్లాదేశ్ వద్ద తీరం దాటిన సిత్రంగ్
  • బలహీనపడిన వైనం
  • ఈ నెల 29న బంగాళాఖాతంలో అల్పపీడనం
  • దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం
సిత్రంగ్ తుపాను బంగ్లాదేశ్ వద్ద తీరం దాటి బలహీనపడింది. అయితే, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. సిత్రంగ్ తుపాను ఏపీపై ఎలాంటి ప్రభావం చూపకపోగా, తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. 

ఈ అల్పపీడనం అక్టోబరు 29 నాటికి శ్రీలంక, తమిళనాడు మధ్యన ఏర్పడనుందని, దీని ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నెలాఖరులో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. 

అటు, ఏపీలోని పలు ప్రాంతాల్లో చలి వాతావరణం నెలకొంది. లంబసింగి, అరకు వంటి ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు పడిపోయాయి.


More Telugu News