డివిడెండ్ రూపంలో ఇన్ఫోసిస్ నుంచి రూ.126 కోట్లు అందుకున్న రిషి సునాక్ అర్ధాంగి

  • ఇన్ఫోసిస్ లో అక్షత మూర్తికి 3.89 కోట్ల షేర్లు
  • ఆమె వాటాల విలువ రూ.5,956 కోట్లు
  • రెండు విడతలుగా డివిడెండ్ ప్రకటంచిన ఇన్ఫోసిస్
  • ఒక్కో షేరుపై మొత్తం డివిడెండ్ రూ.32.5
బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ భార్య అక్షత మూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అని తెలిసిందే. అక్షత మూర్తికి ఇన్ఫోసిస్ లో భారీగా షేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, 2022 సంవత్సరానికి గాను అక్షత మూర్తి ఆ వాటాలపై భారీ డివిడెండ్ పొందారు. ఆమెకు తన వాటాలపై రూ.126.61 కోట్ల ఆదాయం లభించింది. 

అక్షత మూర్తికి ఇన్ఫోసిస్ లో 0.93 శాతం వాటా ఉంది. ఆమె పేరిట 3.89 కోట్ల షేర్లు ఉండగా, వాటి విలువ రూ.5,956 కోట్లు. సెన్సెక్స్ లో ఇవాళ ఇన్ఫోసిస్ షేరు రూ.1,527.40 వద్ద ట్రేడవుతోంది. 

ఈ ఏడాది మే 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్ఫోసిస్ ఒక్కో షేరుపై రూ.16 చొప్పున డివిడెండ్ చెల్లించింది. మే నుంచి అక్టోబరు వరకు రూ.16.5 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఒక్కో షేరుపై  మొత్తం డివిడెండ్ రూ.32.5 కాగా, అక్షత మూర్తికి తన వాటాలపై భారీ మొత్తంలో డివిడెండ్ దక్కింది.


More Telugu News