రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కావడంపై అమెరికా అధ్యక్షుడి ఊహించని స్పందన

రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కావడంపై అమెరికా అధ్యక్షుడి ఊహించని స్పందన
  • అద్భుతమని కొనియాడిన జో బైడెన్
  • మైలురాయిగా నిలిచిపోతుందన్న అభిప్రాయం
  • భారత సంతతి ప్రజల సేవలకు ప్రశంసలు
భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నిక కావడం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఎంతో అద్భుతమని అభివర్ణించారు. ‘‘నా ఉద్దేశ్యంలో రిషి సునాక్ రాజును కలవడానికి వెళ్లినప్పుడు అదెంతో అద్భుతంగా ఉంటుంది. అదొక ఆదర్శనీయమైన మైలురాయిగా నిలిచిపోతుంది. ఇది నిజంగా గొప్ప విషయమే’’అంటూ బైడెన్ తన స్పందన వ్యక్తం చేశారు. వలస భారతీయులు సాధిస్తున్న విజయాలను ఆయన అంగీకరించారు. 

దీపావళి సందర్భంగా వైట్ హౌస్ లో అధ్యక్షుడు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చీకట్లను పారదోలి, ప్రపంచానికి వెలుగును తేగల శక్తి ప్రజలకు ఉంటుందన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. కమలా హ్యారిస్ ను ఎంచుకున్నది బైడెన్ అన్నది తెలిసిందే. తన ప్రభుత్వంలో ఆసియా అమెరికన్లు గతంలో ఎన్నడూ లేనంత అధికంగా ఉన్న విషయాన్ని బైడెన్ ప్రస్తావిస్తూ, ధన్యవాదాలు తెలియజేశారు. 



More Telugu News