అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులకు ఆమోదం తెలపడం నా పరిధిలోని అంశం: గవర్నర్ తమిళిసై
- బిల్లులు ఆమోదించే ప్రక్రియలో తనకు విస్తృత అధికారాలున్నాయన్న తమిళిసై
- తన పరిధికి లోబడి నిర్ణయాలు తీసుకుంటానని వ్యాఖ్య
- రాజ్ భవన్ లో తనకు అయ్యే ఖర్చును సొంతంగా భరిస్తున్నానన్న తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసైకి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆమె మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా తన పరిధిలోనిదని ఆమె అన్నారు. బిల్లులను ఆమోదించే అంశంలో తనకు విస్తృతమైన అధికారాలు ఉంటాయని చెప్పారు. తన పరిధికి లోబడి తాను నిర్ణయాలు తీసుకుంటానని అన్నారు.
తాను ఎవరికీ వ్యతిరేకం కాదని చెప్పారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. రిపబ్లిక్ దినోత్సవం రోజున తనను జెండాను ఆవిష్కరించనివ్వలేదని ఆమె విమర్శించారు. తాను ఏనాడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని చెప్పారు. రాజ్ భవన్ లో తనకు అయ్యే ఖర్చును సొంతంగా భరిస్తున్నానని, ప్రభుత్వ సొమ్మును ఉపయోగించుకోవడం లేదని తెలిపారు.