మునుగోడు యువత కోసం అతిపెద్ద పారిశ్రామికవాడ నెలకొల్పుతున్నాం: కేటీఆర్
- ప్రైవేట్ రంగంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్న కేటీఆర్
- దండు మల్కాపూర్ లో ఆసియాలోనే పెద్ద పారిశ్రామికవాడను నిర్మిస్తున్నామన్న మంత్రి
- స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ వేగంగా నిర్మితమవుతోందని వ్యాఖ్య
ప్రైవేట్ రంగంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి యువత అండగా నిలబడాలని కోరారు. తెలంగాణ పారిశ్రామిక సమాఖ్య భాగస్వామ్యంతో మునుగోడు యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడను దండు మల్కాపూర్ లో 2019లోనే ప్రభుత్వం నెలకొల్పిందని తెలిపారు.
ఇందులో 35 వేల మంది స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఈ పార్కులో ఫుడ్ ప్రాసెసింగ్, టాయ్ పార్క్ కూడా వస్తోందని తెలిపారు. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ శరవేగంగా నిర్మితమవుతోందని చెప్పారు.