ఇస్లామాబాద్ హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్ కు చుక్కెదురు
- ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్ పై నిషేధం విధించిన ఎన్నికల సంఘం
- ఈసీ నిర్ణయాన్ని నిలిపేస్తూ ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేసిన ఇమ్రాన్
- ఇమ్రాన్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఇస్లామాబాద్ హైకోర్టులో చుక్కెదురైంది. ప్రధానిగా ఉన్న సమయంలో తనకు విదేశాల నుంచి వచ్చిన ఖరీదైన బహుమతులను తక్కువ ధరకు తీసుకుని, ఎక్కువ ధరకు అమ్ముకున్నారనే ఆరోపణలతో ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై ఎన్నికల సంఘం వేటు వేసిన సంగతి తెలిసిందే.
ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఇస్లామాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలని ఆయన హైకోర్టును కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఎన్నికల కమిషన్ ఆదేశాలను తక్షణమే ఆపేందుకు హైకోర్టు నిరాకరించింది. అప్పీల్ ను తిరిగి దాఖలు చేయడానికి, ఎన్నికల సంఘం ఉత్తర్వులను నిలిపివేయాలని కోరడానికి మూడు రోజుల సమయాన్ని ఇచ్చింది.