ఆ రోజు మాత్రం వెక్కి వెక్కి ఏడ్చాను: నటి ప్రగతి
- అందమైన అమ్మ పాత్రల్లో మెప్పిస్తున్న ప్రగతి
- ఒక హీరో ధోరణి బాధపెట్టిందంటూ వ్యాఖ్య
- అందుకే హీరోయిన్ గా ఎక్కువ సినిమాలు చేయలేదంటూ వివరణ
- 24 ఏళ్లకే మదర్ పాత్రలు చేయడం మొదలెట్టానంటూ ఆవేదన
అమ్మ పాత్రలతో బిజీగా ఉన్న ప్రగతి .. తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో పాల్గొన్నారు. తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను ఆమె ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రగతి మాట్లాడుతూ .. ""ఒక హీరోతో రెయిన్ సీన్ చేయాలన్నారు. కాస్ట్యూమ్స్ విషయంలో నేను అభ్యంతరం వ్యక్తం చేశాను. ఆ సమయంలో ఆ హీరో చేసిన వ్యాఖ్యలు నాకు నచ్చలేదు. దాంతో ఆ పాట చేయకుండా వెళ్లిపోయాను. ఆ కారణంగానే హీరోయిన్ గా చేయడం మానుకుని, సీరియల్స్ చేసుకోవడం మొదలుపెట్టాను.
చంద్రమోహన్ గారి ఫ్యామిలీతో మాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన భార్యను నేను ఆంటీ అని పిలిచే దానిని. అలాంటి నేను మొదటిసారిగా చంద్రమోహన్ గారికి భార్య పాత్రను చేయవలసి వచ్చింది. తెరపై నేను మొదటిసారిగా మదర్ కేరక్టర్ చేసినప్పుడు నా వయసు 24 మాత్రమే. నేను ఆల్రెడీ హీరోయిన్ గా చేసిన దానిని .. అదే వయసులో ఉన్న హీరోయిన్స్ కి తల్లిగా చేయవలసి వచ్చినప్పుడు మాత్రం వెక్కి వెక్కి ఏడ్చాను.
ఎందుకంటే నేను సెట్లోకి వెళ్లగానే .. 'ఈవిడేంటి జడ వేసుకుని వచ్చింది .. ముడి వేసుకుని రమ్మనండి' అన్నారు. అంతే మేకప్ రూమ్ లోకి వెళ్లి ఏడ్చేశాను. ఆ తరువాత నుంచి మాత్రం మదర్ వేషాలను గౌరవించడం మొదలుపెట్టాను. ఆ తరహా పాత్రలు వేయడానికి ఆలోచన చేయలేదు. ఆ రోజు నుంచి అవకాశాల కోసం ఎవరినీ అడిగిందీ లేదు .. ఎదురుచూసిందీ లేదు" అంటూ చెప్పుకొచ్చారు.