కాలం చెల్లిన 1500 చట్టాలను రద్దు చేస్తాం: కిరణ్ రిజిజు
- ఇప్పుడున్న పరిస్థితులకు వాటి అవసరంలేదు
- వాటితో ఆటంకమే తప్ప జనాలకు ఉపయోగంలేదు
- పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉపసంహరించుకుంటామని వెల్లడించిన న్యాయ శాఖ మంత్రి
ప్రజలకు ఏమాత్రం ఉపయోగంలేని పురాతనకాలం నాటి చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులకు ఏమాత్రం సరిపడని ఆ చట్టాలతో ప్రజలకు ఉపయోగం లేకపోగా అనవసర భారంగా మారుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ చట్టాలను తొలగించడం ద్వారా ప్రజలకు ప్రశాంతమైన జీవనం అందించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని ఆయన వివరించారు. ఇలాంటి సుమారు 1500 చట్టాలను త్వరలో రద్దు చేస్తామని మంత్రి వివరించారు. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ చట్టాలను ఉపసంహరించుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
‘సాధారణ ప్రజాజీవనంపై కొన్ని చట్టాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు ప్రశాంతంగా జీవించేలా చూడడమే వాటి ఉద్దేశం. కానీ కాలం చెల్లిన చట్టాలు ప్రజలకు భారంగా మారుతున్నాయి. ప్రజలకు ఏమాత్రం ఉపయోగంలేని సుమారు 1500 పురాతన కాలం నాటి చట్టాలను తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి మేం నిర్ణయించాం. ప్రస్తుత కాలంలో ఆ చట్టాలతో ఏమాత్రం ఉపయోగంలేదు’అని కేంద్ర మంత్రి రిజిజు అన్నారు.