మొహాలీ ఇన్నింగ్స్‌ను ఇది భర్తీ చేసింది: విరాట్ కోహ్లీ
- పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో చివరి బంతికి విజయం సాధించిన భారత్
- చివరి వరకు క్రీజులో నిలిస్తే విజయం సొంతమవుతుందని భావించామన్న కోహ్లీ
- షహీన్ అఫ్రిది, హరీష్ రవూఫ్‌ను టార్గెట్ చేయాలని ముందే అనుకున్నామన్న మాజీ సారథి
- ప్రేక్షలకు మద్దతుకు కోహ్లీ ధన్యవాదాలు
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నిన్న పాకిస్థాన్‌తో నరాలు తెగేలా సాగిన ఉత్కంఠ మ్యాచ్‌లో భారత జట్టు చివరి బంతికి విజయం సాధించి శుభారంభం చేసింది. క్రికెట్ చరిత్రలో ఇంత ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ ఈ దశాబ్దంలోనే ఇది మొదటిది కావడం విశేషం. బంతిబంతికి విజయం చేతులు మారిన వేళ చివరి బంతికి విజయం సాధించిన టీమిండియా ప్రపంచకప్ ప్రస్థానాన్ని సగర్వంగా ప్రారంభించింది. ఈ విజయం క్రెడిట్ మొత్తం ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లీకి దక్కుతుంది. చివరి బంతి వరకు క్రీజులో నిలిచిన కోహ్లీ అద్భుత ఆటతీరుతో మరోమారు ‘కింగ్’ అనిపించుకున్నాడు. 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 82 పరుగులు చేసి ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడడం తనకే చెల్లు అని నిరూపించుకున్నాడు.
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. తాను మాటలు మార్చిపోయానని, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని అన్నాడు. ఎలా జరిగిందో ఐడియా కూడా లేదన్నాడు. వికెట్లు కోల్పోయి జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ చివరి వరకు క్రీజులో నిలబడ గలిగితే విజయం సాధించవచ్చని పాండ్యా, తాను భావించామన్నాడు. పెవిలియన్ ఎండ్ నుంచి బౌలింగ్ చేసే షహీన్ అఫ్రిదిని టార్గెట్ చేయాలని, ఆ తర్వాత హరీస్ రవూఫ్ బౌలింగులో ఎటాక్ చేస్తే పాక్ ఒత్తిడిలోకి వెళ్లిపోతుందని తమకు తెలుసని అన్నాడు. చివరి ఓవర్‌ను ఎలాగూ నవాజ్ వేస్తాడని ముందే ఊహించామన్నాడు.
చివరి 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన సమయంలో రెండు సిక్సర్లు బాదడం వాతావరణాన్ని తేలిక చేసిందని అన్నాడు. చివరి బంతికి సిక్సర్ బాదడం అద్భతమని, దీంతో ఆరు బంతుల్లో లక్ష్యం 16 పరుగులకు దిగి వచ్చిందని అన్నాడు. తన శక్తిసామర్థ్యాలను నమ్ముకుని ఆడానని పేర్కొన్నాడు. మొహాలీలో ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్సే ఇప్పటి వరకు అత్యుత్తమంగా ఉండేదని, ఇప్పుడీ ఇన్నింగ్స్ దానిని భర్తీ చేసిందని అన్నాడు. హార్దిక్ పాండ్యా మద్దతుగా నిలిచాడని, భారీ సంఖ్యలో హాజరైన ప్రేక్షకుల మద్దతు కూడా లభించిందని కోహ్లీ.. ఈ సందర్భంగా వారికి ధన్యావాదలు తెలిపారు.