మంత్రులపై జనసైనికులు దాడి చేసే అవకాశం ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: నాదెండ్ల మనోహర్

  • విశాఖ పరిణామాలతో వైసీపీ, జనసేన మధ్య ఆగ్రహజ్వాలలు
  • మంత్రులపై దాడి జరిగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాలు
  • ఖండించిన నాదెండ్ల మనోహర్
  • జనసేనపై మరో కుట్ర అంటూ మండిపాటు
ఇటీవల విశాఖలో జరిగిన పరిణామాలు, మంగళగిరిలో పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రులపై జనసేన శ్రేణులు దాడి చేసే అవకాశాలున్నాయంటూ దుష్పచారం జరుగుతోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

ఈ తప్పుడు ప్రచారాన్ని తాము ఖండిస్తున్నట్టు తెలిపారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేరుతో జనసేనపై మరో కుట్రకు తెరదీశారని మండిపడ్డారు. ఇలాంటి ప్రచారాలు ఎవరు చేస్తున్నారో తమకు తెలుసని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. 

జనసేనకు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక వైసీపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఈ కుట్రపై డీజీపీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. వైసీపీ కుట్రలను జనసైనికులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.


More Telugu News