31 పరుగులకే 4 వికెట్లు డౌన్... పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
- టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా, పాకిస్థాన్ పోరు
- మెల్బోర్న్ వేదికగా మ్యాచ్
- టీమిండియా టార్గెట్ 160 రన్స్
- చెలరేగిన పాక్ పేసర్లు
- భారత టాపార్డర్ విలవిల
పాకిస్థాన్ పై ఓ మోస్తరు లక్ష్యమే కదా... ఈజీగా ఛేదిస్తారనుకుంటే... టీమిండియా టాపార్డర్ బ్యాట్స్ మెన్ పేలవంగా ఆడారు. 160 పరుగుల టార్గెట్ ను ఛేదించేందుకు బరిలో దిగిన భారత్ 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. పాక్ పేసర్ల దాటికి భారత బ్యాట్స్ మెన్ విలవిల్లాడారు. హరీస్ రవూఫ్ 2 వికెట్లు తీయగా, నసీమ్ షా ఓ వికెట్ పడగొట్టాడు.
ఓపెనర్లు కేఎల్ రాహుల్ (4), రోహిత్ శర్మ (4) సింగిల్ డిజిట్ స్కోరుకే సరిపెట్టుకోగా, సూర్యకుమార్ యాదవ్ 12 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆల్ రౌండర్ గా న్యాయం చేస్తాడనుకుని కాస్త ముందే అక్షర్ పటేల్ ను బ్యాటింగ్ కు దింపినా, అతడు చేసింది రెండు పరుగులే. లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.
ప్రస్తుతం భారత్ 10 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లకు 45 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ (12 బ్యాటింగ్), హార్దిక్ పాండ్యా (7 బ్యాటింగ్) ఉన్నారు. టీమిండియా గెలవాలంటే 60 బంతుల్లో 115 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి.