రాణించిన బౌలర్లు... పాకిస్థాన్ ను 159 పరుగులకు పరిమితం చేసిన టీమిండియా
- మెల్బోర్న్ లో దాయాదుల మ్యాచ్
- రాణించిన అర్షదీప్, హార్దిక్ పాండ్యా
- ఇఫ్తికార్, షాన్ మసూద్ అర్ధసెంచరీలు
- ఓ మోస్తరు స్కోరు చేసిన పాకిస్థాన్
మెల్బోర్న్ లో పాకిస్థాన్ తో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. ఈ సూపర్-12 మ్యాచ్ లో పాకిస్థాన్ ను ఓ మోస్తరు స్కోరుకే కట్టడి చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, హార్దిక్ పాండ్యా 3, భువనేశ్వర్ కుమార్ 1, మహ్మద్ షమీ 1 వికెట్ తీశారు.
పాక్ బ్యాటింగ్ లైనప్ లో షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్ అర్ధసెంచరీలతో రాణించారు. ముఖ్యంగా ఇఫ్తికార్ అహ్మద్ భారీ సిక్సర్లతో విరుచుకుపడడంతో పాక్ కు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. ఇఫ్తికార్ 34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు.
ఓ దశలో పాక్ భారీ స్కోరు దిశగా సాగుతుండగా, ఇఫ్తికార్ అహ్మద్ ను షమీ అవుట్ చేయడంతో పరిస్థితి భారత్ నియంత్రణలోకి వచ్చింది. చివర్లో షహీన్ అఫ్రిదీ ధాటిగా ఆడి 8 బంతుల్లో 16 పరుగులు చేశాడు. షాన్ మసూద్ 52 పరుగులతో అజేయంగా నిలిచాడు.