కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులతో దీపావళి వేడుకలు
- మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్ ఆదర్శనీయమైన చర్య
- తన నివాసంలోనే చిన్నారులతో కలసి సంబరాలు
- వారు సంతోషంగా ఉండేందుకు వీలైన ప్రతిదీ చేస్తానని ప్రకటన
కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల కోసం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ఆదర్శనీయమైన పని చేశారు. తన భార్యతో కలసి చిన్నారుల మధ్య ఘనంగా తన నివాసంలోనే దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం డ్యాన్స్ చేసి చిన్నారులను అలరించారు.
‘‘నా పిల్లల్లారా.. మీరు ఈ విధంగా నవ్వుతూ ఉండడానికి, మీరు సంతోషంగా ఉండేందుకు, మీ ముఖం ఎప్పుడూ ఆనందంతో వెలిగిపోయేందుకు నాకు వీలైన ప్రతిదీ చేస్తాను. మన బీజేపీ ప్రభుత్వం కూడా దీన్ని చేస్తుంది’’అని ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహాన్ హిందీలో ట్వీట్ చేశారు. తన నివాసంలో దీపావళి సంబరాలకు వచ్చిన చిన్నారులకు ఆయుష్ కిట్ ను బహుమతిగా ఇచ్చారు. నిజంగా కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు ఏమిచ్చినా, ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది.