జిన్ పింగ్ కు పాక్ ప్రధాని అభినందనలు
- నిజమైన స్నేహితుడంటూ పొగడ్తలు
- పాక్ ప్రజల తరఫున తెలిపిన పీఎం షెహబాజ్ షరీఫ్
- ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపిన పాక్ ప్రెసిడెంట్
చైనా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నికైన జిన్ పింగ్ పై పాకిస్థాన్ అభినందనలు కురిపించింది. తమ దేశానికి నిజమైన స్నేహితుడంటూ పొగడ్తలతో ముంచెత్తింది. పాకిస్థాన్ ప్రజల తరఫున ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీతో పాటు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్విట్టర్ లో జిన్ పింగ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత అంతటి గౌరవం పొందిన నేతగా జిన్ పింగ్ ను కొనియాడారు. చైనా ప్రజలకు సేవ చేయడంలో జిన్ పింగ్ చూపిన అంకితభావానికి ఈ ఎన్నికే నిదర్శనమని పాక్ ప్రధాని షెహబాజ్ అన్నారు. జిన్ పింగ్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు పాక్ ప్రెసిడెంట్ వెల్లడించారు.
చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్ మూడోసారి ఎన్నికయ్యారు. పార్టీ జనరల్ సెక్రెటరీగా, చైనా సెంట్రల్ మిలటరీ కమిషన్ చీఫ్ గా కూడా జిన్ పింగ్ ఎన్నికయ్యారు. పాకిస్థాన్ ఆర్థిక, రాజకీయ భాగస్వామిగా చైనా కొనసాగుతోంది. పాక్ లో పలు ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు చైనా, పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) ప్రాజెక్టును చైనా చేపట్టింది. దీంతోపాటు పాక్ కు అన్నివిధాలుగా మద్దతుగా చైనా నిలుచుంటుంది. ఇటీవలే పాక్ ఉగ్రవాది పేరును నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో చేర్చకుండా ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుపడిన విషయం తెలిసిందే.