తగ్గేదే లే అంటున్న ఓలా.. అత్యంత చౌక స్కూటర్ విడుదల
- ఎస్1 ఎయిర్ ఆవిష్కరణ
- దీని ధర రూ.79,999
- రూ.999తో బుకింగ్
- 2023 ఏప్రిల్ నుంచి డెలివరీ
- పెట్రోల్ స్కూటర్లకు పోటీనిచ్చే యోచన
ఓలా ఎలక్ట్రిక్ వినియోగదారులను ఎప్పటికప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఈ విడత చౌక ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఓలా ఎస్ ఎయిర్’ ను విడుదల చేసింది. ఓలా ఎలక్ట్రిక్ తొలుత ఎస్1, ఎస్1ప్రో మోడళ్లను ఆవిష్కరించింది. ఇందులో ఎస్1 ప్రో హైఎండ్ మోడల్. కానీ, ఎస్1 మాత్రం విక్రయానికి తీసుకురాలేదు. ఎస్1 ప్రో విక్రయాలు తగ్గిపోవడంతో, తిరిగి ఇటీవలే ఎస్1 స్కూటర్ ను రూ.99 వేల ధరకు తీసుకొచ్చింది. అయితే, ఇది కూడా అంచనాలను అందుకోలేదా.. లేక మార్కెట్లో కొత్త ట్రెండ్ తీసుకురావాలని అనుకుందా..? ఏమో కానీ మరింత తక్కువ ధరకు స్కూటర్ ను తీసుకొచ్చింది. పెట్రోల్ స్కూటర్ యాక్టివాకు గట్టిపోటీ ఇవ్వడం తమ ఉద్దేశ్యమని ఓలా ఫౌండర్ భవీష్ అగర్వాల్ ప్రకటించారు.
ఎస్1, ఎస్1 ప్రోకు పెద్దగా మార్పులు ఉండవు. డిజైన్, సాఫ్ట్ వేర్ అంతా ఒకటే. కాకపోతే బ్యాటరీ కెపాసిటీలో మార్పులు ఉంటాయి. ఇప్పుడు ఎస్ 1 ఎయిర్ కూడా మిగిలి రెండింటి డిజైన్ మాదిరే ఉంది. వెనుక బాడీ కలర్ లో డ్యుయల్ టోన్ తో స్వల్ప మార్పు చేసింది ఓలా. అలాగే, బ్యాటరీ 2.5 కిలోవాట్ హవర్ సామర్థ్యంతో ఉంటుంది. మోటార్ 4.5 కిలోవాట్ పవర్ తో వస్తుంది. ఒక్కసారి చార్జ్ తో 101 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, 90 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళుతుందని తయారీ సంస్థ ప్రకటించింది.
7 అంగుళాల డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. 2.2 గిగాహెర్జ్ 8 కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్ సామర్థ్యంతో, మ్యూజిక్ ప్లేబ్యాక్, నేవిగేషన్ తదితర ఫీచర్లతో వస్తుంది. ఎకో, నార్మల్, స్పోర్ట్స్ మోడ్ లు ఉంటాయి. 0 నుంచి 100 శాతం చార్జింగ్ కు 4.5 గంటల సమయం తీసుకుంటుంది. కస్టమర్లు రూ.999 చెల్లించి దీన్ని బుక్ చేసుకోవచ్చు. 2023 ఫిబ్రవరి నుంచి కొనుగోలుకు అవకాశం ఇస్తారు. ఏప్రిల్ నుంచి డెలివరీ చేస్తారు. తొలుత రూ.79,999 ధరకు దీన్ని విక్రయించనుంది. తర్వాత రూ.85వేలకు ధర పెరగనుంది.