భారత్- పాకిస్థాన్ జట్ల మ్యాచ్ కు వరుణుడు బ్రేక్ వేస్తాడా..?
- శనివారం రాత్రి నుంచి పొడి వాతావరణమే
- నేడు వర్షం అవరోధం కలిగించదన్న తాజా అంచనాలు
- సత్తా చాటేందుకు రెండు జట్లు సమాయత్తం
టీ20 ప్రపంచ కప్ లో భాగంగా దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ నేడు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ స్టేడియంలో జరగనుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డు పడతాడన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ఇరు దేశాల క్రికెట్ అభిమానుల్లో గుబులు నెలకొంది. కానీ తాజా వాతావరణ పరిస్థితిని గమనిస్తే, నేటి మ్యాచ్ అవరోధాలు లేకుండా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శనివారం రాత్రి నుంచి ఎటువంటి వర్షం లేదు. దీంతో నేటి మ్యాచ్ కు వర్షం అవరోధం కాబోదన్న తాజా అంచనాలు వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయి మ్యాచ్ ను వీక్షించే అవకాశం అభిమానులకు కలగనుంది. రెండు జట్లు మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ లో మునిగిపోయాయి. పోటీని సవాలుగా తీసుకుంటామని, పాకిస్థాన్ మంచి జట్టు అని చెప్పడానికి సంకోచించడం లేదని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
‘‘ఒత్తిడి అనే మాటను నేను వాడను. ఎందుకంటే అది ఎప్పుడూ ఉండేదే. అదేమీ మారదు. కాకపోతే ఈ మ్యాచ్ ను సవాలుగా తీసుకుంటాను. పాకిస్థాన్ జట్టు ఎంతో సవాలునిచ్చే టీమ్’’అని రోహిత్ వ్యాఖ్యానించాడు. అటు పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ స్పందిస్తూ.. ‘‘వాతావరణం మన చేతుల్లో ఉండదు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ 100 శాతం సత్తా చూపించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’’అని ప్రకటించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది.