ఎన్నికల సంఘం తనపై విధించిన నిషేధాన్ని సవాల్ చేసిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
- ప్రధానిగా ఉన్న సమయంలో ఇమ్రాన్ కు కానుకలు
- ఆ కానుకలు అమ్ముకున్నారని ఆరోపణలు
- ఐదేళ్ల నిషేధం విధించిన ఎన్నికల సంఘం
- పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు
- ఇస్లామాబాద్ హైకోర్టులో అప్పీల్ చేసిన ఇమ్రాన్ ఖాన్
ప్రధానిగా ఉన్న సమయంలో విదేశాల నుంచి అందుకున్న బహుమతుల వివరాలను బహిర్గతం చేయలేదని, పైగా ఎంతో విలువైన ఆ కానుకలను అమ్ముకున్నారన్న ఆరోపణలపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఆ దేశ ఎన్నికల సంఘం ఐదేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అటు, ఆయన పార్లమెంటు సభ్యత్వంపైనా అనర్హత వేటు పడింది.
ఎన్నికల సంఘం తనపై విధించిన నిషేధాన్ని ఇమ్రాన్ ఖాన్ నేడు ఇస్లామాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. తన న్యాయవాది అలీ జాఫర్ ద్వారా న్యాయస్థానంలో అప్పీల్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ పిటిషన్ ను ఇస్లామాబాద్ హైకోర్టు విచారణకు స్వీకరించింది.
అయితే, ఈ పిటిషన్ లో పేర్కొన్న అంశం ఇప్పటికిప్పుడు విచారించదగ్గ అత్యవసర అంశమేమీ కాదని, దీనిపై తాము సోమవారం నాడు విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది.
70 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ప్రధాని పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. పాక్ కు ప్రస్తుతం షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా వ్యవహరిస్తున్నారు.