ఎదిరించే వాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం... రాహుల్ యాత్రకు ఎమ్మెల్యే సీతక్క స్వాగతం
- రేపు తెలంగాణలో అడుగుపెట్టనున్న రాహుల్ గాంధీ యాత్ర
- రాహుల్ యాత్రకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు టీపీసీసీ ఏర్పాట్లు
- రాహుల్ ను శక్తిమంతమైన నేతగా అభివర్ణిస్తూ వీడియో విడుదల చేసిన సీతక్క
భారత్ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ... ఆదివారం సాయంత్రం తెలంగాణలో అడుగుపెట్టనున్నారు. తెలంగాణలో రాహుల్ యాత్రకు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం చెప్పేందుకు టీపీసీసీ భారీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతున్న రాహుల్ యాత్ర ఆదివారం సాయంత్రానికి తెలంగాణకు చేరనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీపీసీసీతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు రాహుల్ యాత్రకు స్వాగతం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ములుగు ఎమ్మెల్యే ధనసిరి అనసూయ అలియాస్ సీతక్క... రాహుల్ యాత్రకు స్వాగతం చెబుతూ శనివారం రాత్రి ఓ ఆసక్తికరమైన వీడియోను విడుదల చేశారు.
ఎదిరించే వాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం అన్న వాక్యాలతో మొదలైన సీతక్క వీడియో రాహుల్ గాంధీని శక్తిమంతమైన నేతగా అభివర్ణించారు. చెడుపై యుద్ధానికి కాలమెప్పుడూ ఓ వీరుడిని సృష్టిస్తుంది.. అడుగులో అడుగేస్తూ అతడు కడలిలా కదిలొస్తాడు.. అంటూ రాహుల్ యాత్ర సాగిన రాష్ట్రాలను ప్రస్తావిస్తూ ఆ వీడియో సాగింది. వెల్ కమ్ రాహుల్ అన్నా అంటూ తన వీడియోకు ఓ కామెంట్ ను జత చేసిన సీతక్క ఆ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.