పలాస పోలీస్ స్టేషన్ వైసీపీ కార్యాలయంగా మారింది... శ్రీకాకుళం జిల్లా ఎస్పీకి ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు
- పలాస సీఐ శంకరరావుపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ
- మంత్రి అప్పలరాజు చెప్పినట్టే సీఐ వింటున్నారని కంప్లైంట్
- సీఐ శంకరరావుపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరిన శ్రీకాకుళం ఎంపీ
టీడీపీ యువ నేత, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా పరిధిలోని పలాస పోలీస్ స్టేషన్ పై సంచలన ఆరోపణలు చేశారు. పలాస పోలీస్ స్టేషన్ ఏకంగా వైసీపీ కార్యాలయంగా మారిపోయిందని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై నేరుగా జిల్లా ఎస్పీకి ఆయన ఫిర్యాదు చేశారు.
టీడీపీ మహిళా నేత గౌతు శిరీష, పార్టీ శ్రేణులతో కలిసి శనివారం శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన రామ్మోహన్ నాయుడు ఎస్పీకి ఫిర్యాదు అందజేశారు. పలాస సీఐ శంకరరావు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని, మంత్రి అప్పలరాజు చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్ ను ఏకంగా వైసీపీ కార్యాలయం మాదిరిగా సీఐ మార్చేశారని ఆయన ఫిర్యాదు చేశారు. పక్షపాతంగా వ్యవహరిస్తున్న సీఐ శంకరరావుపై చర్యలు తీసుకోవాలని ఆయన ఎస్పీని కోరారు.