తొలి రోజు రూ. 7 కోట్ల కలెక్షన్స్‌తో తమిళ్లో ‘ప్రిన్స్’ జోరు.. తెలుగులో ఎంత రాబట్టిందంటే..!
- జాతిరత్నాలు చిత్రంతో భారీ విజయం సాధించిన కేవీ అనుదీప్
- రెండో చిత్రంగా శివకార్తికేయన్ తో ‘ప్రిన్స్’
- తమిళ్ తో పాటు తెలుగులో శుక్రవారం విడుదల
జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్ కేవీ. సెన్సిబుల్ కామెడీ, సింగిల్ లైన్ పంచ్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. జాతిరత్నాలు ఘన విజయం సాధించిన తర్వాత ఆయన తమిళ నటుడు శివకార్తికేయన్ హీరోగా ‘ప్రిన్స్’ చిత్రంతో ప్రేక్షకుల ముందు వచ్చారు.
స్టాండప్ కమెడియన్ నుంచి నటుడిగా మారి దక్షిణాదిలో మంచి పేరు తెచ్చుకున్న శివ కార్తికేయన్ తొలిసారి నేరుగా తెలుగు సినిమా చేశారు. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. అదే రోజు ఓరి దేవుడా, సర్దార్, జిన్నా కూడా రిలీజ్ అయ్యాయి. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ‘ప్రిన్స్’ చిత్రానికి మంచి ఓపెనింగ్సే వచ్చాయి. నైజాం ఏరియాలో రూ. 35 లక్షలు, ఏపీలో రూ. 55 లక్షల వసూళ్లు లభించాయి. మొత్తంగా తెలుగులో రూ. 90 లక్షల వసూళ్లు రాబట్టింది.
అయితే, తమిళ్ లో మాత్రం ఈ చిత్రానికి అద్భుత ఆరంభం దక్కింది. తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ఏకంగా ఏడు కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు విదేశాల్లో బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ట్వీట్ చేశారు. అయితే, వసూళ్ల వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ఈ చిత్రంలో శివకార్తికేయన్ స్కూల్ టీచర్ పాత్రలో నటించారు. ఆయన సరసన ఉక్రెయిన్ కు చెందిన మరియా హీరోయిన్ పాత్ర పోషించింది. హీరో తండ్రిగా సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు.