హైదరాబాద్ లో చిన్నారిపై లైంగికదాడిపై దర్శకుడు శేఖర్ కమ్ముల ఆవేదన

  • చిన్నారిపై అత్యాచారం చేసిన ప్రిన్సిపాల్ కారు డ్రైవర్
  • చిన్నారి పడే వేదనను ఊహించలేకపోతున్నానన్న శేఖర్ కమ్ముల
  • పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు రాజీ పడకూడదని వ్యాఖ్య
హైదరాబాద్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారిపై స్కూలు ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన కలకలం రేపింది. సదరు స్కూలు గుర్తింపును రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. మరోవైపు ఈ ఘటనపై సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల ఆవేదన వ్యక్తం చేశారు.

డీఏవీ పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల బాలికపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడటం ఘోరమని అన్నారు. నిస్సహాయతతో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదని చెప్పారు. ఆ చిన్నారి పడే వేదనను ఊహించలేకపోతున్నానని అన్నారు. ఎంతో ధైర్యంతో న్యాయం కోసం పోరాటం చేస్తున్న బాలిక తల్లిదండ్రులకు జోహర్లు అని చెప్పారు. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు రాజీ పడకూడదని అన్నారు. ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకూడదని చెప్పారు. మన పిల్లల భద్రత విషయంలో రాజీ పడితే భయంకరమైన సమాజాన్ని మనమే రూపొందించినవారమవుతామని అన్నారు.


More Telugu News