కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్
- బీజేపీకి రాజీనామా ప్రకటించిన దాసోజు, స్వామి గౌడ్
- గంటల వ్యవధిలోనే ఆ పార్టీకి రాజీనామాలు చేసిన వైనం
- ప్రగతి భవన్ లో సందడి వాతావరణంలో టీఆర్ఎస్ లోకి చేరిక
బీజేపీకి రాజీనామా చేసిన స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ లు శుక్రవారం సాయంత్రం టీఆర్ఎస్ లో చేరారు. ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఇద్దరు కీలక నేతలు ఒకేసారి పార్టీలో చేరడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ శ్రేణుల నినాదాలతో ప్రగతి భవన్ మారుమోగింది.
స్వామి గౌడ్ తో పాటు దాసోజు శ్రవణ్ కూడా శుక్రవారమే బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ తోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన స్వామి గౌడ్.. 2020లో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అయితే బీజేపీ తీరు నచ్చని క్రమంలో బీజేపీకి రాజీనామా చేసిన ఆయన తన సొంత గూటికి చేరుకున్నారు. ఇక దాసోజు శ్రవణ్ 3 నెలల క్రితమే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరారు. బీజేపీలోకి వెళ్లిన నెలల వ్యవధిలోనే ఆ పార్టీకి దాసోజు గుడ్ బై చెప్పడం గమనార్హం.