మూవీ రివ్యూ: 'జిన్నా'
- ఈ రోజునే విడుదలైన 'జిన్నా'
- విలేజ్ నేపథ్యంలో నడిచే సినిమా
- తెరపై ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించిన విష్ణు
- సెకండాఫ్ నుంచి దారితప్పిన కథ
- ప్రధానమైన బలంగా నిలిచిన సంగీతం
మంచు విష్ణు హీరోగా .. సూర్య దర్శకత్వంలో 'జిన్నా' సినిమా రూపొందింది. సొంత బ్యానర్లో విష్ణు నిర్మించిన ఈ సినిమాకి, సూర్య దర్శకత్వం వహించాడు. విష్ణు సరసన నాయికలుగా పాయల్ - సన్నీ లియోన్ నటించారు. జి.నాగేశ్వరరెడ్డి మూలకథను అందించిన ఈ సినిమాకి కోన వెంకట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ శుక్రవారమే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ సర్ ప్రైజ్ చేస్తుందంటూ ప్రమోషన్స్ లో విష్ణు చెబుతూ వచ్చాడు. ఆయన చెప్పినట్టుగా ఆడియన్స్ ను ఈ సినిమా ఏ స్థాయిలో సర్ ప్రైజ్ చేసిందనేది చూద్దాం.
ఈ కథ 2007లో చిత్తూరు జిల్లా 'రంగంపేట' విలేజ్ లో మొదలవుతుంది. అక్కడి స్కూల్లో గాలి నాగేశ్వరరావు (మంచు విష్ణు) చదువుకుంటూ ఉంటాడు. అతనికి తనని 'జిన్నా' అని పిలవడమే ఇష్టం. అలాంటి పరిస్థితుల్లోనే తన కూతురు రేణుకను తీసుకుని అమెరికా నుంచి 'రంగంపేట' గ్రామంలోని తన తమ్ముడు వీరస్వామి( నరేశ్) దగ్గరికి నారాయణస్వామి (సురేశ్) వస్తాడు. ఆ సమయంలోనే జిన్నా - రేణుక మధ్య స్నేహం ఏర్పడుతుంది. రేణుక మాట్లాడలేదు .. వినికిడిశక్తి లోపం కూడా ఉంటుంది. సొంత ఊరులో ఉండమని వచ్చిన నారాయణ స్వామి, తమ్ముడు వీరస్వామి స్వార్థం భరించలేక ఆస్తిపాస్తులను అతనికే ఇచ్చేసి తిరిగి అమెరికా వెళ్లిపోతాడు.
కాలచక్రం గిర్రున తిరుగుతుంది .. వీరస్వామి తన ఆస్తిపాస్తులను పోగొట్టుకుని వీధిన పడతాడు. ఇక జిన్నా విషయానికి వస్తే అతను అప్పు చేసి ఒక టెంట్ షాపు పెట్టుకుని నడుపుతుంటాడు. అయితే అతను టెంట్ వేస్తే ఆ పెళ్లి ఆగిపోతుందనే ఒక ప్రచారం జరుగుతుంది. దాంతో అతని వ్యాపారం దెబ్బతినడంతో, అప్పు తీర్చలేకపోతాడు. అప్పుతీర్చమని గోవర్ధన్ ఒత్తిడి చేస్తుంటాడు. అతనిని ప్రేమిస్తున్న స్వాతి (పాయల్) కూడా ఈ విషయంలో ఎలాంటి సహాయం చేయలేకపోతుంది. గోవర్ధన్ దగ్గర చేసిన 35 లక్షల రూపాయల అప్పును తీర్చడం .. తన పినతండ్రి చేతిలో ప్రెసిడెంటుగిరిని తన చేతిలోకి తీసుకోవడం ఇప్పుడు జిన్నా ముందున్న లక్ష్యం.
సరిగ్గా ఆ సమయంలోనే ఆ ఊరికి రేణుక (సన్నీ లియోన్) వస్తుంది. తన బాబాయ్ వీరాస్వామి ఇంటిని తనఖా నుంచి విడిపించి అతని కుటుంబాన్ని ఆదుకుంటుంది. ఇక జిన్నాను పెళ్లి చేసుకోవాలనేదే ఆమె ఆశ .. ఆశయం. తనకి మనసిచ్చిన జిన్నాను రేణుక ఎక్కడ తన్నుకుపోతుందో అనేది స్వాతి టెన్షన్. రేణుక దగ్గర కోట్ల రూపాయలను ఉన్నాయని తెలిసిన జిన్నా, అప్పుల బారి నుంచి బయటపడటానికీ .. ప్రెసిడెంటు ఎన్నికలలో గెలవడానికి ఆమెను ప్రేమిస్తున్నట్టుగా నటిస్తుంటాడు. అయితే జిన్నాను పెళ్లి చేసుకుని రేణుక వెళ్లిపోతే .. కోట్ల రూపాయలు చేజారిపోతాయని భావించిన వీరస్వామి అన్న కూతురిని హత్య చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేది కథ.
ఇంతకుముందు విష్ణుకి యాక్షన్ కామెడీ సినిమాల ద్వారా హిట్స్ ఇచ్చిన జి.నాగేశ్వర రెడ్డి ఈ సినిమాకి కథను అందించాడు. పైగా క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ఈ కథ వెనుక కోన వెంకట్ ఉన్నాడు, అందువలన సహజంగానే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. విశ్రాంతి వరకూ ఈ కథ యాక్షన్ కామెడీ జోనర్ లో .. గతంలో వచ్చిన మోహన్ బాబు సినిమాలను గుర్తుచేస్తూ నడుస్తుంది. అయితే సెకండాఫ్ నుంచి ఈ సినిమా 'చంద్రముఖి' తరహాలో రూట్ మార్చుకుంటుంది. ఎక్కడెక్కడో తిరిగి మళ్లీ అదే విలేజ్ కి చేరుతుంది. కథనం స్లోగా అనిపించినప్పటికీ ఫస్టాఫ్ బెటర్ అనిపిస్తుంది. విశ్రాంతి సమయంలో కథ మలుపు తీసుకోవడంతోనే గ్రాఫ్ పడిపోతూ వచ్చింది.
సర్వే చేయించి మరీ రేణుక పాత్రకు సన్నీ లియోన్ ను తీసుకున్నట్టుగా విష్ణు చెప్పాడు. కానీ నిజం చెప్పాలంటే ఈ పాత్రకి సన్నీ లియోన్ మైనస్. ఆమె నుంచి ఆడియన్స్ రొమాన్స్ ను ఆశిస్తారు తప్పా .. అందుకు పూర్తి భిన్నమైన పాత్రలో ఆమెను చూడలేరు. చిన్నప్పుడు తాను ఇష్టపడిన రేణుక ఫారిన్ నుంచి తిరిగొస్తే .. జిన్నా ఆమెనే ప్రేమించాలి. కానీ స్వాతిని అంటిపెట్టుకునే ఉండటంతో, సహజంగానే రేణుక పాత్రపై ఆడియన్స్ కి అనుమానం మొదలవుతుంది. ఒకానొక సందర్భంలో రేణుక, 'నా కోట్ల రూపాయలన్నీ నీవే' అంటూ లాకర్ నెంబర్ చెప్పి 'కీ' కూడా జిన్నాకి ఇచ్చేస్తుంది. అయినా ఆమె ఇంట్లో లేని సమయంలో ఆ డబ్బు కాజేయడానికి జిన్నా రావడం .. ఆ సమయంలోనే ఆమె గురించిన ఒక రహస్యాన్ని జిన్నా తెలుసుకోవడం వంటి సన్నివేశాల్లో పొంతన లేదనిపిస్తుంది.
యాక్షన్ కామెడీగా విలేజ్ నేపథ్యంలో మొదలైన ఈ కథపై, ఇంటర్వెల్ నుంచి హాలీవుడ్ లో సైకో తరహా సినిమాల ప్రభావం పడినట్టుగా అనిపిస్తుంది. 'జిన్నా' టైటిల్ కి మంచి మార్కులు పడ్డాయి .. కానీ టైటిల్ కి తగిన ఎంటర్టైన్ మెంట్ కథాకథనాల్లో లేదు. 'జిన్నా' పాత్రలో విష్ణు చాలా ఎనర్జిటిక్ గా చేశాడు. డాన్సులు .. ఫైట్లు ఇంతకుముందు సినిమాల్లో కంటే పెర్ఫెక్ట్ గా చేశాడు. సన్నీ లియోన్ బాగా చేయడానికి ట్రై చేసింది కానీ .. ఆమెను ఆడియన్స్ ను చూసే కోణం వేరు. అందుకు భిన్నంగా చూడాలనుకునేవారు చాలా తక్కువ. ఇక పాయల్ ఉన్నంతలో అందంగానే మెరిసింది. నరేశ్ .. చమ్మక్ చంద్ర పోషించినవి ముఖ్యమైన పాత్రలే. అయితే వెన్నెల కిశోర్ పాత్ర ఏ ప్రయోజనాన్ని ఆశించి ఎంటరయిందనే విషయం అర్థం కాదు.
ఇక కథాకథనాల పరంగా కాస్త వీక్ గా అనిపించిన ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచింది అనూప్ రూబెన్స్ సంగీతం అనే చెప్పాలి. 'జిన్నా భాయ్' .. 'గోలీ సోడా' .. 'జారు మిఠాయి' సాంగ్స్ తో కథకి ఒక ఊపును ... ఉత్సాహాన్ని తీసుకుని వచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కథలో నుంచి బయటికి రాకుండా చూశాడు. తన కెరియర్లోనే బెస్ట్ సాంగ్స్ ఇవి అని విష్ణు చెప్పిన మాట నిజమేనని అనిపిస్తుంది. ఇక చోటా కె నాయుడు ఫొటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఫైట్స్ .. డాన్సులు .. నైట్ ఎఫెక్ట్ సీన్స్ గొప్పగా ఆవిష్కరించాడు. ఎడిటింగ్ ఫరవాలేదు. భాను - నందు సంభాషణల్లో ప్రత్యేకత ఏమీ లేదు ... అక్కడక్కడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాత్రం ఉన్నాయి.
సాధారణంగా విలేజ్ నేపథ్యంలోని కథల్లో బలమైన కుటుంబ నేపథ్యాలు కనిపిస్తాయి .. ఈ సినిమాలో అవే లోపించాయి. విష్ణుకి ఒక బామ్మ మాత్రమే ఉంటుంది .. పాయల్ కి అసలు ఫ్యామిలీయే లేదు. అలాగే అప్పు తీర్చమని బెదిరించేవాడే తప్ప అసలు విలన్ లేడు. యాక్షన్ .. కామెడీ ఓకే .. కానీ ఎమోషన్స్ లేవు. ఇద్దరు గ్లామరస్ హీరోయిన్స్ ఉన్నప్పటికీ హీరో వైపు నుంచి రొమాన్స్ పాళ్లు లోపించాయి. సన్నీలియోన్ కి మునుపటి గ్లామర్ లేదు .. ఆమెను ఎంచుకోవడం ఒక మైనస్ అయితే .. ఫారిన్ లో పుట్టి పెరిగిన ఆ పాత్రకి రేణుక అనే పేరు పెట్టడం మరో మైనస్. ఇక 'నువ్వు నను ట్రోల్ చేయ్ .. ఎంజాయ్ చేస్తా, మా వాళ్ల జోలికొస్తే పీచు తీస్తా' అంటూ ఈ సినిమాలో తన పాత్ర ద్వారా విష్ణు హెచ్చరిక చేయడం కొసమెరుపు.