వరుసగా ఆరో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 104 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 12 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 9 శాతం వరకు లాభపడ్డ యాక్సిస్ బ్యాంక్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. మార్కెట్లు వరుసగా ఆరో రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతలు ఉన్నప్పటికీ, మన మార్కెట్లు లాభాలను మూటకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 104 పాయింట్లు లాభపడి 59,307కి చేరుకుంది. నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 17,576 వద్ద స్థిరపడింది. బ్యాంకెక్స్ సూచీ 2 శాతానికి పైగా లాభపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (8.96%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.13%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.11%), కోటక్ బ్యాంక్ (2.05%), నెస్లే ఇండియా (1.43%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-3.20%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.39%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.63%), ఎల్ అండ్ టీ (-1.51%), ఏసియన్ పెయింట్స్ (-1.38%).


More Telugu News