జర్నలిస్టు అంకబాబుపై తదుపరి చర్యలు వద్దు... ఏపీ సీఐడీకి హైకోర్టు ఆదేశం

  • సోషల్ మీడియా పోస్టును ఫార్వార్డ్ చేశారంటూ అంకబాబుపై సీఐడీ కేసు
  • హైకోర్టులో బెయిల్ పొందిన సీనియర్ జర్నలిస్టు
  • తనపై కేసు కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ వేసిన అంకబాబు
  • తదుపరి విచారణ వచ్చే నెల 8కి వాయిదా 
సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన పోస్టును ఫార్వార్డ్ చేశారన్న ఆరోపణలపై సీనియర్ జర్నలిస్టు అంకబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హైకోర్టు నుంచి బెయిల్ పొందిన అంకబాబు...తాజాగా తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. 

ఈ సందర్భంగా కేసును కొట్టివేసే అంశంపై నిర్ణయాన్ని ప్రకటించని హైకోర్టు.. అంకబాబుపై తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ సీఐడీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను వచ్చే నెల (నవంబర్) 8 కి వాయిదా వేసింది.


More Telugu News