హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కు పెన్ను బుక్ చేసిన లాయర్... కారణం ఇదే
- ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీయాక్టులో త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరిన న్యాయవాది కరుణాసాగర్
- 1650 పేజీలతో కౌంటర్ సిద్ధం చేశామని, సంతకాలకు గడువు కోరిన ప్రభుత్వం తరఫు న్యాయవాది
- కమిషనర్ కు పార్కర్ పెన్ను బుక్ చేసి త్వరగా సంతకం చేయాలన్న కరుణాసాగర్
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కు ఓ న్యాయవాది ఆన్ లైన్ లో పార్కర్ పెన్ను ఆర్డర్ చేశారు. కమిషనర్ కార్యాలయం చేరుకునేలా, డెలివరీ అయిన తర్వాత డబ్బులు చెల్లించేలా చేసిన ఓ ఈ- కామర్స్ వెబ్ సైట్ లో చేసిన ఈ ఆర్డర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ కేసు విచారణలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది.
దీనిపై స్పందించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది మొత్తం 1,650 పేజీలతో కౌంటరు సిద్ధం చేశామని తెలిపారు. వాటిపై సంతకాలు చేసి కోర్టులో సమర్పించేందుకు గడువు కోరారు. వాదనలు విన్న ధర్మాసనం కేసు విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టును కోరిన న్యాయవాది కరుణాసాగర్.. హైదరాబాద్ సీపీ పేరిట రూ. 357 విలువ గల పార్కర్ పెన్ను బుక్ చేశారు. దానితో కౌంటర్ పేజీల్లో సంతకం చేయాలని కోరారు.